రగిలిపోతున్న ‘మండలి’.. జంపేనా?

Published on Fri, 03/08/2024 - 09:51

సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డ సీటు విషయంలో తీవ్ర అసంతృప్తితో టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ రగిలిపోతున్నారు. ఉమ్మడి అభ్యర్ధిగా తనకే వస్తుందని ఆశపడ్డ బుద్ధప్రసాద్.. తొలి జాబితాలో అవకాశం దక్కక పోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు. పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటు జనసేనకు ఇచ్చే అవకాశం ఉంది. అవనిగడ్డ సీటు తమకే  కేటాయించాలని మండలి బుద్ధప్రసాద్, టీడీపీ శ్రేణులు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఇప్పటికే అవనిగడ్డ టీడీపీ నేతలు,కార్యకర్తలు ఏకగ్రీవ తీర్మానం చేసి చంద్రబాబు, పవన్‌కు పంపించగా, అవనిగడ్డ తమ్ముళ్ల డిమాండ్‌ను చంద్రబాబు పట్టించుకోలేదు. సీటు దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు బుద్ధ ప్రసాద్‌ దూరంగా ఉంటున్నారు. దీంతో అక్కడ టీడీపీ క్యాడర్‌ నైరాశ్యంలో కూరుకుపోయింది. మరో వైపు, కృష్ణా జిల్లాలో టీడీపీకి మరోషాక్‌ తగలనుందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ మారే యోచనలో బుద్ధ ప్రసాద్‌ ఉన్నట్లు సమాచారం.

‘‘తన పేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నానని.. పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పొందినట్లుగా ఉందంటూ బుద్ధ ప్రసాద్‌ గతంలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘నేను పదవుల కోసం పుట్టలేదు. రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి. డబ్బు రాజకీయాలకు ప్రధానమైపోయింది. ధనవంతుల కోసమే పార్టీలు అభ్యర్ధులుగా అన్వేషిస్తున్నాయంటూ చంద్రబాబుపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు.

ఇదీ చదవండి: పొత్తుల పితలాటకం 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)