Breaking News

టార్గెట్‌ పెద్దారెడ్డి.. తాడిపత్రిలో మళ్లీ జేసీ మార్క్‌ రాజకీయం

Published on Fri, 09/12/2025 - 08:59

సాక్షి, అనంతపురం: తాడిపత్రి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెద్దారెడ్డి ఇంటిని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి టార్గెట్ చేశారు. ఆక్రమణలు ఉన్నాయంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద సర్వే చేపట్టారు.

తాడిపత్రి చేరుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తన ఇంటి వద్ద చేపట్టిన సర్వేను పరిశీలించారు. తన ఇళ్లు, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు అందజేశారు. తన ఇంటి స్థలంలో మునిసిపల్ స్థలం ఆక్రమించలేదని వివరణ ఇచ్చారు.

జేసీ ఆదేశాలతోనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద సర్వే చేపట్టారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాడిపత్రి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి ఇప్పటికే ఒకసారి కొలతలు వేసిన అధికారులు.. మళ్లీ మళ్లీ కొలతలు వేయడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పెద్దారెడ్డి సహా వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లను కూల్చేస్తానంటూ గతంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే.

కాగా, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ నెల 6న ఎట్టకేలకు తాడిపత్రిలోని తన నివాసానికి చేరుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో పోలీసులు దిగొచ్చారు. ప్రభుత్వ అండతో టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్రెడ్డి కూటమి సర్కారు ఏర్పడినప్పటి నుంచి పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. చివరికి ఆయన గత నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేలా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)