Breaking News

Mahanadu: మహానాడు.. మాకెందుకయ్యా?

Published on Wed, 05/28/2025 - 11:47

సాక్షి, వైఎస్సార్ జిల్లా: తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు(TDP Mahanadu) కార్యక్రమ ప్రాంగణం.. కార్యకర్తలు లేక వెలవెలబోతోంది. నిన్న మొదటి రోజు.. అందునా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న టైంలోనే పసుపు దండు అక్కడి నుంచి వెళ్లిపోళ్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఇవాళ.. బుధవారం రెండోరోజూ అంతకు మించి దృశ్యాలే కనిపించాయి. 

రెండో రోజు.. కడప మహానాడు ప్రాంగణం వైపు వెళ్లే రోడ్లు అన్నీ ఖాళీగా కనిపించాయి. ఉదయం 11గం.లకే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. స్థానిక కార్యకర్తలు సైతం కనీసం అటువైపు తిరిగి చూడలేదు. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కిందపడిపోయినా.. తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు కనిపించడం లేదు. ప్రతినిధుల సభ సందర్భంగా నేతల ప్రసంగాలు ప్రారంభం కాకముందే వచ్చిన ఆ కొద్దిమంది కూడా వెనుదిరి వెళ్తూ కనిపించారు. ఆ సమయంలో భోజనాల దాకా అయినా ఉండాలని నేతలు నిలువరించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.

కావాలనే కడపలో మహానాడును నిర్వహించడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోవడమే ఈ అసంతృప్తికి కారణం. మరోవైపు.. టీడీపీ అనుకూల మీడియాలు పోటెత్తిన పసుపు దండు అంటూ లేని హడావిడిని చూపించే ప్రయత్నం చేస్తోంది. చివరిరోజైన రేపు(గురువారం) ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించింది. కానీ, పరిస్థితి చూస్తుంటే ఆ ప్లాన్‌ ఘోరంగా అట్టర్‌ ప్లాప్‌ అయ్యేలా ఉందన్న ఆందోళన టీడీపీ నేతల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

ఇదీ చదవండి: మహానాడు కాదు కాస్త దగానాడుగా..

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)