Breaking News

టక్కుటమారి.. టముకుతో సరి

Published on Fri, 03/22/2024 - 05:27

నరసరావుపేట ఎంపీ, కనిగిరి, కందుకూరు అసెంబ్లీ స్థానాల కేటాయింపుసాక్షిప్రతినిధి, ఒంగోలు: జయహో బీసీ... అంటూ వారిని ఉద్దరిస్తామని టీడీపీ–జనసేన సంయుక్తంగా ప్రకటించి నేడు విస్మరించాయి. బీసీలను అందులో ప్రధానంగా యాదవ సామాజికవర్గానికి ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్క సీటు కూడా కేటాయించకుండా చంద్రబాబు వారి వెన్ను విరిచారు. కానీ బీసీలు అంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ కాదు, బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి భరోసా కల్పించారు. ఈ మూడు జిల్లాల్లో 50 శాతానికి పైగా బీసీ ఓట్లు ఉన్నాయి.

ఒక్కో జిల్లాలో 2.50 లక్షల నుంచి 3.50 లక్షల వరకు యాదవ ఓటర్లు ఉన్నారు. అయితే ఆ జిల్లాల్లో పార్లమెంట్‌ కానీ, అసెంబ్లీకి కానీ టికెట్లు కేటాయించకపోవటంతో టీడీపీపై యాదవులు రగిలిపోతున్నారు. కానీ యాదవులకు వైఎస్సార్‌సీపీ సముచిత స్థానం కల్పించింది. ఆ జిల్లాల్లో వారికి పెద్దపీట వేసింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన యాద­వ నేత బీదా మస్తాన్‌రావును రాజ్యసభకు పంపింది. నరసరావుపేట పార్లమెంట్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనీల్‌కుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేసింది.

ప్రకాశం జిల్లా కనిగిరి అసెంబ్లీకి సాధారణ జెడ్పీటీసీ సభ్యుడిని ప్రకటించి సంచలనం సృష్టించింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ను కందుకూరు అసెంబ్లీకి పోటీలో నిలబెట్టింది. మరోవైపు గురజాల నియోజకవర్గానికి చెందిన యాదవ నేత జంగా కృష్ణమూర్తికి టీడీపీలో చాన్సే లేకుండా పోయి­ంది. ఆయన గురజాల టికెట్‌ కావాలని వైఎస్సా­ర్‌సీపీని వీడి టీడీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీలో ఆయనకు సీఎం జగన్‌ ఎంతో ప్రాధా­న్యత కల్పించారు.

పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆ తరువాత ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయితే గురజాల అసెంబ్లీ సీటు ఇస్తానని జంగాకు టీడీపీ నమ్మబలికి మొండిచేయి చూపింది. చీరాలలో టీడీపీ నేత, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మద్దులూ­రి మాలకొండయ్యను దాదాపు ఆ పార్టీ పక్కన పెట్టేసింది. టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్య­క్షుడు నూక­సాని బాలాజీకి బాబు  మొండిచేయి చూపా­రు.

యాదవుల్లో సమర్థులు లేరా?
ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలో టీడీపీలో యాదవ సామాజి­కవర్గానికి చెందిన సమర్థులు లేరా? ఒకప్పటిలా టీడీపీ పరిస్థితి లేదు. వైఎస్సార్‌సీపీలో ఒక పార్లమెంట్, రెండు అసెంబ్లీ సీట్లిచ్చి సీఎం జగన్‌ యాదవులను ఎంతగానో గౌరవించారు. మాకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలనే ఆదరిస్తాం.    – మిరియం శ్రీనివాసులు, 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)