Breaking News

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై టీడీపీ కక్ష సాధింపు

Published on Thu, 07/04/2024 - 11:24

సాక్షి, అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ కక్ష సాధింపు చర్యలకు దిగింది. మునిసిపల్ అధికారులు.. పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేశారు. నోటీసులు ఇవ్వకుండానే కొలతలు వేయటం వైఎస్సార్ సీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ఆదేశాలతో మునిసిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్ సీపీ శ్రేణులు మండిపడుతున్నారు.

కాగా, తిరుపతి నగరంలో నాలుగంతస్తుల భవనాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా ఒక టీడీపీ నేత దౌర్జన్యానికి దిగారు. తన స్థలాన్ని కాపాడుకునేందుకు వేరొకరి భవనాన్ని కూల్చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు భవన యజమానిపై దాడికి దిగారు. ఈ వ్యవహారం నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది.

తిరుపతిలో తిరుమల బైపాస్‌ మున్సిపల్‌ పార్క్‌ ఎదురుగా ఉన్న విరజా మార్గంలోని టీడీపీ నేత అన్నా రామచంద్రయ్య స్థలంలో మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. అతడి ఇద్దరు కుమార్తెలు కార్పొరేటర్లుగా ఉన్నారు. దీంతో ఆయన అధికారబలంతో తన స్థలాన్ని కాపాడుకునేందుకు వేరొకరి ఇంటి (నాలుగు అంతస్తుల భవనం) పైకి ఆ రోడ్డుని మళ్లించారు. నూతనంగా నిర్మించిన నాలుగంతస్తుల భవనంపై తన మనుషులతో మంగళవారం 15 అడుగుల పబ్లిక్‌ రోడ్డు అని రాయించారు.

ఈ విషయమై భవన యజమాని మాస్టర్‌ ప్లాన్‌ మ్యాప్‌ని, అందుకు సంబంధించిన ఆధారాలను చూపించారు. ఈ విషయాన్ని స్పష్టం చేయాల్సిన టౌన్‌ప్లానింగ్‌ అధికారులు.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగి నోరెత్తడంలేదు. బాధితుడు అధికారులను ప్రాధేయపడుతున్నా పట్టించుకోలేదు. ఇదే సమయంలో టీడీపీ నేత అన్నా రామచంద్రయ్య తన మనుషులతో భవనం వద్ద పనులు చేసుకుంటున్న యజమానిపై దాడి చేశారు. ఈ దాడి సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోలు బయటకు వచ్చాయి.

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)