Breaking News

వైఎస్సార్‌సీపీ నేతల వాహనాలపై టీడీపీ గూండాల దాడి

Published on Tue, 05/20/2025 - 09:30

రెండు గంటల పాటు టిడిపి గూండాలు భయోత్పాతం సృష్టించారు
ఎమ్మెల్సీ ,మొండితోక అరుణ్ కుమార్

  • తిరువూరు వెళ్లడానికి మాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు
  • పోలీసులే దగ్గరుండి టిడిపి గూండాలతో మాపై దాడి చేయించారు
  • మేం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాం
  • నా కారును ధ్వంసం చేస్తున్నా.. పోలీసులు చోద్యం చూశారు
  • కౌన్సిలర్లకు భద్రత కల్పించమని ఎన్నికల కమిషనర్ , హైకోర్టు ఆదేశాలున్నా పోలీసులు పెడచెవిన పెట్టారు
  • ఒక్కో కౌన్సిలర్ కు ఒక్కొక్క గన్ మెన్ ఇవ్వాలని ఆదేశాలున్నాయ్
  • పోలీసులు రక్షణ ఇవ్వకపోతే మేమే రక్షణ కవచంలా నిలిచాం
  • మా కారును ధ్వంసం చేసి మా పై హత్యాయత్నం చేశారు
  • తిరువూరు టిడిపి ఎమ్మెల్యే వీధి రౌడీలా ప్రవర్తించాడు
  • మా కారును అడ్డగించి మా పై దాడి చేసారు
  • నన్ను , స్వామిదాస్ ను కులం పేరుతో దూషించి చంపేస్తామని బెదిరించారు  
  • కులం పేరుతో దూషించి బెదిరించిన వారి పై నేను , స్వామిదాస్ కేసు పెట్టి... హై కోర్టుకు ఈడుస్తాం

కోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు: తిరువూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి,నల్లగట్ల స్వామిదాస్

  • నేను 35 ఏళ్లుగా తిరువూరు రాజకీయాలు చూస్తున్నా
  • తిరువూరు టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఒక గూండా మాదిరి వ్యవహరించారు
  • ఇలాంటి ఎమ్మెల్యేని తిరువూరు ప్రజలు ఎన్నడూ చూడలేదు
  • కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు
  • టిడిపి నేతలను చట్టపరంగా శిక్షిస్తాం
  • మాకు రక్షణ కల్పించమని కోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు
  • వైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్లను బలవంతంగా లాక్కెళ్లిపోయారు
  • అసలు ఈ రాష్ట్రం ఎటుపోతుంది
  • రాజ్యాంగబద్ధంగా కూటమి ప్రభుత్వం నడుచుకోవడం లేదు
  • రాబోయేది జగన్ మోహన్ రెడ్డి 2.0 పాలనే
  • తప్పుచేసిన ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటాం
  • మాపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన వారి పై కేసు పెట్టి చట్టం ముందు నిలబెడతాం

ప్రశాంతమైన తిరువూరులో టీడీపీ గూండాలు విధ్వంసం స్పష్టించారు: దేవినేని అవినాష్‌

  • టీడీపీ గూండాలు మాపై దాడి చేశారు
  • కేశినేని చిన్నియే టీడీపీ గూండాలను మాపైకి పంపారు
  • మా కారును ధ్వంసం చేశారు.. మమ్మల్ని హతమార్చాలని చూశారు
  • టీడీపీ గూండాల దాడికి పోలీసులు సహకరించారు
  • మాపై దాడి చేసిన వారిని ఎవరినీ వదిలి పెట్టం
  • పోలీసులే రాజకీయం చేస్తున్నారు
  • కౌన్సిలర్లకు వారి ఇంటి నుంచి భద్రత ఇస్తామని వితండవాదం చేశారు
  • మా కౌన్సిలర్లకు మేమే రక్షణగా నిలిచాం
  • టిడిపి ఎంపీ కేశినేని చిన్ని మందు పోయించి టిడిపి గూండాలను మా పైకి రెచ్చగొట్టారు    
  • మా కారును పైకి లేపి పల్టీలు కొట్టించి...ధ్వంసం చేయాలని  చూశారు
  • మా కారు ధ్వంసం చేసే వరకూ పోలీసులు చూస్తూ ఊరురున్నారు
     

👉వైఎస్సార్‌సీపీ నేతలు అరెస్ట్‌

దేవినేని అవినాష్‌, అరుణ్‌కుమార్‌లు అరెస్ట్‌
తిరువూరు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
రెడ్డిగూడెం స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు

👉తిరువూరులో టీడీపీ గూండాల అరాచకం

  • వైఎస్సార్‌సీపీ నేతల వాహనాలపై టీడీపీ గూండాల దాడి
  • దేవినేని అవినాష్‌, అరుణ్‌కుమార్‌ వాహనాలపై దాడి
  • వైఎస్సార్‌సీపీ నేతల కారు అద్దాలు పగలగొట్టిన టీడీపీ గూండాలు
  • దారికాసి వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్న టీడీపీ గూండాలు
  • ఎ.కొండూరు మండలం రేపూడి క్రాస్‌ వద్ద టీడీపీ గూండాల విధ్వంసం

సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు బరి తెగించేశారు.. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు, వైఎస్సార్‌సీపీ నేతలను తిరువూరు వెళ్లకుండా చేసేందుకు కుట్రలకు తెరతీశారు. తిరువూరు వెళ్లే మార్గంలో రామచంద్రాపురం, చీమల పాడు వద్ద టీడీపీ.. భారీగా కార్యకర్తలను మోహరింపచేసింది. వైఎస్సార్‌సీపీ నేత స్వామిదాస్‌ ఇంటిని టీడీపీ గూండాలు ముట్టడించారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల కుటుంబసభ్యులపై టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగారు.

వైఎస్సార్‌సీపీ నేతల్ని దారికాసి టీడీపీ గూండాలు అడ్డగించారు. అవినాష్‌, స్వామిదాస్‌ అరుణ్‌ వాహనాలను అడ్డగించారు. వాహనాలు కదలకుండా టీడీపీ గూండాలు చుట్టుముట్టారు. అవినాష్‌, స్వామిదాస్‌పై టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేసింది. 13వ వార్డు కౌన్సిలర్‌ తండ్రితో టీడీపీ ఫిర్యాదు చేయించింది. ఓటమి భయంతో  టీడీపీ గూండాలు దౌర్జన్యాలు చేస్తున్నారు. కాగా.. భద్రత కల్పించడంలో ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలను కూడా పోలీసులు లెక్కచేయడం లేదు. తిరువూరు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల రక్షణ విషయంలో వితండవాదం చేస్తున్నారు.

YSRCP నేతలను రౌండప్ చేసిన టీడీపీ గూండాలు

తిరువూరు వస్తేనే భద్రత కల్పిస్తామని పోలీసులు అంటున్నారు. నిన్న టీడీపీ గూండాల దాడితో  వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ నుంచి ఎన్నిక జరిగే వరుకు కౌన్సిల్‌ హాలు వరకు రక్షణ కల్పించాలని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు కోరుతున్నారు. టీడీపీ గూండాల దాడులపై ఈసీకి వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

తిరువూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని సంఖ్యాబలం లేకపోయినా తన ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్నిక వాయిదా వేయించాలనే కుట్రతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను మున్సిపల్‌ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్‌ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. దౌర్జన్యకాండను అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. చివరకు కోరం సరిపోలేదంటూ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మాధురి నేటికి (మంగళవారం) వాయిదా వేశారు.


 


 


 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)