Breaking News

ఆగని టీడీపీ దాడులు.. వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇళ్ల వద్ద ఉద్రిక్తత

Published on Fri, 06/07/2024 - 15:00

కృష్ణా, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ అరాచక కాండ కొనసాగుతోంది. శుక్రవారం కూడా వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీల ఇళ్లపై దాడులకు యత్నించింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 

తెలుగు యువతకు చెందిన కొందరు నాయకులు.. శుక్రవారం మధ్యాహ్నాం కొడాలి నాని ఇంటిపైకి రాళ్లు, గుడ్లు విసిరారు. ఆపై టపాసులు కాల్చి నానా హంగామా చేశారు. ఇంటిలోకి చొచ్చుకునిపోయే ప్రయత్నమూ చేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు.. వాళ్లను అడ్డుకుని అక్కడి నుంచి పంపించే యత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులతోనూ వాళ్లు వాగ్వాదానికి దిగారు. 

ఇక.. విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైనా దాడి జరిగింది. టీడీపీ గుండాలు వంశీ ఉండే అపార్ట్‌మెంట్‌ను నలువైపులా చుట్టుముట్టి.. వాహనాల్లో అటు ఇటు తిరుగుతూ హల్‌ చల్‌ చేశారు. వంశీ ఉంటున్న ఫ్లోర్‌ వైపు రాళ్లు విసిరారు. ఈ దాడిలో పార్కింగ్‌లో ఉన్న ఆయన వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆపై పోలీసులు రంగంలోకి దిగి టీడీపీ శ్రేణుల్ని చెదరగొట్టి.. చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. అయితే.. 

సీఆర్పీఎఫ్‌, పోలీస్‌ బలగాలు మోహరించినప్పటికీ.. టీడీపీ యువత మరోసారి వల్లభనేని వంశీ ఇంటి పైకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైనా టీడీపీ గుండాలు దాడికి యత్నించారు. ఏసీపీ వాహనంతో పాటు మరో వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి టీడీపీ రౌడీలను చెదరగొట్టాయి. ఆపై వంశీ ఇంటి వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.

ఇక విజయవాడలోనే గత అర్ధరాత్రి రాజీవ్ నగర్‌లోని వైఎస్సార్‌సీపీ నేత పెద్దిరెడ్డి శివారెడ్డి ఇంటి పై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో ఆయన కారు అద్ధాలు ధ్వంసం అయ్యాయి. ఇంటి బయట ఫర్నీచర్‌ను పూర్తిగా నాశనం చేశారు. ఆ సమయంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన స్థానికులు.. భయంతో వణికిపోయారు.  ఆపై శివారెడ్డిని చంపేస్తామంటూ బెదిరిస్తూ వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు.  దీంతో ఈ ఉదయం టీడీపీ నేతల దాడిపై నున్న పోలీస్ స్టేషన్‌లో పెద్దిరెడ్డి శివారెడ్డి ఫిర్యాదు చేశారు.

తూర్పు గోదావరి: రాజమండ్రిలో టీడీపీ నేతలు అరాచకానికి దిగారు. మోరంపూడి ఫ్లై ఓవర్‌ శిలాఫలకం నాశనం చేశారు. సమాచారం అందుకున్న మాజీ ఎంపీ మార్గాని భరత్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు.  ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న రాజమండ్రిలో.. ఇలాంటి ఘటనలు సరికాదని టీడీపీ శ్రేణుల్ని ఉద్దేశించి హితవు పలికారాయన. అలజడులు సృష్టించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉందని అన్నారాయన.

Videos

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)