Breaking News

పత్రికా స్వేచ్ఛపై ఎల్లో బ్యాచ్‌ దాడి

Published on Wed, 07/10/2024 - 18:50

విశాఖపట్నం, సాక్షి: ఏపీలో కూటమి ప్రభుత్వ ప్రతీకార దాడులు మరో మలుపు తిరిగాయి. నిష్పక్షపాతంగా కథనాలు రాసే మీడియా సంస్థలనూ ఎల్లో బ్యాచ్‌ వదలడం లేదు. తాజాగా.. ఇవాళ నగరంలోని డెక్కన్‌ క్రానికల్‌ ఆఫీస్‌ మీద దాడికి తెగబడ్డారు. 

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై కూటమి ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుందని డీసీ ఈ మధ్య ఒక వార్తను ప్రచురించింది. దీంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులు దౌర్జన్యానికి తెగబడ్డాయి. టీడీపీకి సంబంధించిన టీఎన్ఎస్ఎఫ్, తెలుగు మహిళ విభాగాలు.. డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడికి ప్రయత్నించాయి. ఒక్కసారిగా లోపలికి చొచ్చుకుపోవాలని చూశాయి.

ఈ క్రమంలో సిబ్బంది అడ్డుకోవడంతో.. వాళ్లలో టీడీపీ కేడర్‌ వాగ్వాదానికి దిగారు. ఆపై ఆగ్రహంతో టీఎన్‌ఎస్‌ఎఫ్‌కు చెందిన కొందరు సంస్థ కార్యాలయంపై రాళ్లు రువ్వి.. బయట ఆ సంస్థ బోర్డును కాల్చేశారు. భవిష్యత్తులో ఇలాంటి కథనాలు రాస్తే.. బాగోదంటూ హెచ్చరిస్తూ వాళ్లు బహిరంగంగానే నినాదాలు చేశారు. ఈ పరిస్థితులతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

ఈ ఘటనపై ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌లో డీసీ సంస్థ ఫిర్యాదు చేసింది. ఇలాంటి చర్యలు తమ కర్తవ్యాల్ని ఆపలేవంటూ డీసీ తన ఎక్స్‌ఖాతాలో సందేశం ఉంచింది. 

దాడిని ఖండించిన జర్నలిస్ట్‌ యూనియన్లు

ఇదిలా ఉంటే.. క్రానికల్ కార్యాలయంపై టీడీపీ అనుబంధ విభాగాల దాడి ఘటనను ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(APUWJ) ఏపీయూడబ్ల్యూజే ఖండించింది. ‘‘విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై కొన్ని పత్రికల్లో  వచ్చిన వార్తకు నిరసనగా తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ కార్యకర్తలు కొందరు విశాఖలోని  డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై రాళ్లు విసిరి, సంస్థ బోర్డును తగలబెట్టడం దిగ్భ్రాంతి కలిగించింది. దీన్ని పత్రికా స్వేచ్ఛపై దాడిగా పరిగణిస్తున్నాం. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి’’ అని యూనియన్ పోలీస్‌ శాఖను కోరింది. 

అలాగే.. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా తమ కార్యకర్తలను అదుపుచేయాలని రాజకీయ పార్టీలకూ యూనియన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు ,ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఎ.పి.ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ బుధవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. మరోవైపు.. 

ప్రజాస్వామ్యంలో దాడులనేవే సమంజసం కాదని  జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ (జాప్ )అంటోంది. డెక్కన్ క్రానికల్ పై దాడిని ఖండింస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.  ‘‘విశాఖ ఉక్కు  ప్లాంట్  ప్రైవేటీకరణ అంశంపై ఎంతోకాలంగా వార్తలు వస్తున్నాయి. అలాంటిది ఒక వార్త తమకు వ్యతిరేకంగా వచ్చిందని దాడికి దిగారు. విశాఖలోని  డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై రాళ్లు విసిరి, సంస్థ బోర్డును తగలబెట్టడం పత్రికా కార్యాలయంలో పనిచేసేవారితో పాటు ప్రజాస్వామ్య వాదులను భయాందోళనకు గురిచేసింది. దీన్ని పత్రికా స్వేచ్ఛపై దాడిగా పరిగణిస్తున్నాం. 

.. దాడికి పాల్పడిన బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తమ కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి. ఈ తరహా దాడులు ప్రజాస్వామ్య స్పూర్తికే విరుద్ధం. ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు కూడా ఇలాంటి సంఘటనల్ని సమర్థించరని భావిస్తున్నాం అని జాప్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం డీ వీ ఎస్ ఆర్ పున్నంరాజు, ప్రధాన కార్యదర్శి ఎం. యుగంధర్ రెడ్డిలు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)