Breaking News

పుంగనూరులో టీడీపీ విధ్వంసకాండ.. ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యాయత్నం!

Published on Thu, 07/18/2024 - 14:29

చిత్తూరు, సాక్షి: పుంగనూరులో ఇవాళ తెలుగుదేశం పార్టీ విధ్వంసకాండ కొనసాగింది. టీడీపీ దాడుల్లో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్ని, సానుభూతిపరుల్ని పరామర్శించేందుకు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఆ నియోజకవర్గానికి వెళ్లారు. అయితే ఆయన పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ యత్నించడం, ఆయనపై దాడికి యత్నించడంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొంది.

మిథున్‌రెడ్డిని అడ్డుకునేందుకు రాళ్ల దాడికి దిగాయి టీడీపీ శ్రేణులు. ఆ కవ్వింపు చర్యలను ప్రతిఘటించేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు యత్నించాయి. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎంపీ గన్‌మెన్‌ గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం ఆయన మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకోగా.. పచ్చ పార్టీ కార్యకర్తలు అక్కడా వీరంగం సృష్టించారు. 

రెడ్డప్ప ఇంటిపైకి రాళ్లు రువ్వారు. ఆయన కారుకు నిప్పు పెట్టారు. అంతేకాదు.. వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. ఈ క్రమంలో 15 కార్లు, పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. మరోవైపు రెడ్డప్ప ఇంటి నుంచి కదిలేదే లేదని, తన పర్యటన కొనసాగుతుందని ఎంపీ మిథున్‌రెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో ఏఎస్పీ రెడ్డప్ప నివాసానికి చేరుకుని మిథున్‌రెడ్డితో చర్చలు జరిపారు. చివరకు.. కట్టుదిట్టమైన భద్రత నడుమ పుంగనూరు నుంచి తిరుపతిలోని మారుతినగర్‌ నివాసానికి ఎంపీ మిథున్‌రెడ్డిని పోలీసులు తరలించారు. 

ఇది హత్యాయత్నమే.. 
ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడిని ఖండించిన వైఎస్సార్‌సీపీ.. దీన్నొక హత్యాయత్నంగా  అభివర్ణించింది. మాజీ ఎంపీ రెడ్డప్ప పుంగనూరు ఉద్రిక్తతలపై స్పందిస్తూ.. ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యయత్నం జరిగిందన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ పాలనలో దాడులు ఎక్కువ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్త: ఎంపీ మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడి

భయపడేది లేదు: మిథున్‌రెడ్డి
పుంగనూరులో గతంలో ఈ తరహా దాడులు ఏనాడూ జరగలేదని, చంద్రబాబు, లోకేష్‌ డైరెక్షన్‌లోనే దాడులు జరగుతున్నాయని, టీడీపీ నేతలు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, ఇలాంటి దాడులకు మేం భయపడమని ఎంపీ మిథున్‌రెడ్డి అంటున్నారు.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)