Breaking News

ప్రజలకు ఏడాదంతా వెన్నుపోటే

Published on Tue, 06/03/2025 - 03:25

సాక్షి, న్యూఢిల్లీ: మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మాయలోపడేసి అధికారంలోకి వచ్చిన కూట­మి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్‌సీపీ అరకు ఎంపీ డాక్టర్‌ గుమ్మా తనూజరాణి పేర్కొన్నారు. ఏడాదంతా సీఎం చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే పాలన సాగించారని మండిపడ్డారు. బాబు వెన్నుపోటు రాజకీయాలను ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరూ ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో పాలు­పంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. 

ోమవా­రం ఢిల్లీలోని ఆమె నివాసంలో తనూజ రాణి మీ­డి­యాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పిలుపు మేరకు జూన్‌ 4న ఏపీవ్యాప్తంగా ‘వెన్నుపోటు’ దినం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆరోజు ప్రజ­లంతా కూటమి మోసాల్ని నిలదీసేందుకు లోక్‌సభ నియోజకవర్గం కేంద్రాల్లో నిర్వహించే భారీ ర్యాలీకి హాజరై జయప్రదం చేయా­లని కోరా­రు. సీఎం చంద్రబాబు  సూపర్‌ సిక్స్‌తో పాటు 143 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.

ఏడాది గడిచినా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఇంకా కల్ల»ొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వెన్నుపోటు దినాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభు­త్వం కుట్రలకు దిగుతోందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాము వెన్నుపోటు దినాన్ని ఘనంగా నిర్వహించి, చంద్రబాబు మోసాలను ప్రపంచానికి చాటిచెబుతామని స్పష్టం చేశారు.

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)