మోదీ పర్యటన.. బీజేపీకి మంత్రి తలసాని సవాల్‌..

Published on Sat, 04/08/2023 - 15:20

సాక్షి, హైదరాబాద్‌: అధికారిక కార్యక్రమాల్లో రాజకీయాలు మాట్లాడటం బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. వందే భారత్‌ రైళ్లను ఎన్నిసార్లు ప్రారంభిస్తారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ తప్పుడు విమర్శలు చేశారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిపై మోదీ మాకు నీతులు చెప్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఏ అభివృద్ధి చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఆపిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

మోదీ హయాంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తలసాని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందకపోతే కేంద్రం ఇన్ని అవార్డులు ఎందుకు ఇస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును అవమానించిన మోదీకి రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని అ‍న్నారు. పార్లమెంట్‌ వేదికగా తెలంగాణపై విషం చిమ్మారని గుర్తు చేశారు. సింగరేణిని ప్రవేటీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

‘భారత్‌ బయోటెక్‌ వచ్చినప్పుడు కేసీఆర్‌ రాకుండా చేసిందెవరు. బీబీ నగర్‌ ఏయిమ్స్‌ను మీరు కట్టారా.  తెలంగాణకు అవార్డులు ఇస్తున్నారు. నిధులు ఇవ్వడం లేదు. ఎంపీగా ఉండి తెలంగాణ ప్రజలకు లక్ష రూపాయలు కూడా కర్చు పెట్టలేదు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదు. దేశానికి అత్యధిక రెవెన్యూ ఇస్తున్న రాఫ్ట ం తెలంగాణ. తెలంగాణకు చట్టం ప్రకారం రావాల్సిందే ఇస్తున్నారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అదనంగా ఇచ్చిందేం లేదు. తెలంగాణ అభివృద్ధిపై మోదీతో చర్చకు మేం సిద్ధం.’ అని మంత్రి తలసాని సవాల్‌ విసిరారు.
చదవండి: కేసీఆర్‌ కోసం ఎదురుచూశాం.. శాలువా కూడా తెచ్చా: బండి సంజయ్‌

Videos

గుర్తుపెట్టుకో అనిత.. మేమిచ్చే రిటర్న్స్ గిఫ్ట్ కి దిమ్మతిరిగి బొమ్మ కనపడుద్ది

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు

వీళ్లు అసలు పోలీసులా రౌడీలా... YSRCP నేతలపై దాడులు.. సజ్జల స్టాంగ్ రియాక్షన్

అర్ధరాత్రి కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్.. పల్నాడులో హైటెన్షన్...

ఏపీలో నేటి నుంచి పరిషత్ పోరు.. నామినేషన్ల వేళ టెన్షన్!

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

నన్ను చంపితే 2028లోపే చంపండి.. 2029 మాత్రం మీకు చుక్కలే

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

Photos

+5

విజయవాడ : భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన సెలెబ్రెటీలు (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!