Breaking News

ఎల్లో మీడియా వక్రీకరించింది

Published on Wed, 01/10/2024 - 04:31

సాక్షి, అమరావతి: సమస్యల పరిష్కారంపై స్థానిక అధికారులు సక్రమంగా స్పందించడం లేదనే ఆవేదనతో ఫేస్‌బుక్‌ లైవ్‌లో నీటి కేటాయింపులపై తాను మాట్లాడిన మాట­­లను ఎల్లో మీడియా వక్రీక­రించిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్యావతి మండిపడ్డారు. తాను ప్రశ్నించింది అధికారులనైతే సీఎం జగన్‌కు వ్యతిరేకంగా మాట్లా­డి­నట్లు ఎల్లో మీడియా చిత్రీకరించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

జిల్లా స్థాయిలో పరిష్కారం కావా­ల్సిన సమస్యలపై అధికారులు స్పందించనప్పుడు సీఎం జగనన్న దగ్గరకు వెళ్తే పనులు అవుతున్నా­యనడంలో తప్పు ఏముందని ప్రశ్నించారు. అదే వీడియోలో జగనన్న స్ఫూర్తితో తామంతా ముందుకెళ్తున్నా­మని చెప్పానని, మరి వాటిని ఎల్లో మీడియా ఎందుకు హైలెట్‌ చేయలేదని నిలదీశారు.

దళిత మహిళగా నియోజ­కవర్గ సమస్యలపై ప్రశ్నించడం నేరమా? అని రామోజీని ప్రశ్నించారు. తప్పుడు రాతలు ఆపకుంటే దళిత మహిళల ఆగ్రహం ఎలా ఉంటుందో చవిచూస్తారని హెచ్చరిస్తూ ఈనాడు దినప­త్రికను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చించివేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. 

పదవి లేకున్నా పార్టీ కోసం పని చేస్తా
రాజకీయాల్లోకి ప్రవేశించే సమయంలో తానేదో భారీ స్థాయిలో భవిష్యత్తు ఊహించి రాలేదని ఎమ్మెల్యే పద్మావతి పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు కచ్చితంగా జగనన్నలాంటి నాయకుడి­తోనే కలిసి పనిచేయాలని కోరుకున్నట్లు చెప్పారు. జగనన్న తనను సొంత చెల్లెలు మాదిరిగా చూసుకు­న్నా­రని తెలిపారు. జగనన్న ఆదేశిస్తే ఎలాంటి పదవి లేకున్నా పార్టీ కోసం పని చేస్తానని, తన సీటు­ను వదులుకునేందుకు సైతం సిద్ధమేనని ప్రక­టించారు.

దేశ చరిత్రలో గుర్తుండిపోయేలా ఎస్సీలకు సీఎం జగన్‌ మేలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలూ జగనన్న పరిపాలన పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాయని చెప్పారు. ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్‌ సీపీలోనే పని చేస్తానని తెలిపారు. తనను జగనన్నకు దూరం చేయాలని కుట్రలు చేస్తే ఏ స్థాయి వ్యక్తికైనా తగిన బుద్ధి చెబు­తానని హెచ్చ­రించారు. సుదీర్ఘ రాజకీయ అనుభ­వం ఉందని చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్ర­బాబు దిక్కుమాలిన రాజకీయాలతో దిగజారిపోతు­న్నారని విమర్శించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)