Breaking News

ఎక్స్‌ట్రాలు వద్దమ్మా.. పవన్‌ కల్యాణ్‌కు ఎందుకంత దురద?

Published on Thu, 04/20/2023 - 13:30

రాజకీయాల్లో కూడా గెస్ట్‌ అప్పిరియ‌న్స్ ఉంటుందని.. పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ సీనియర్‌ జర్నలిస్టు దేవుపల్లి అమర్‌ చురకలు అంటించారు. నాటకాలు, సినిమాల్లో కాసేపు కనిపించి మెరుపులా వచ్చి వెళ్లిపోయే అతిథి పాత్రలు ఉంటాయి. రాజకీయాల్లో అటువంటి పాత్రే పవన్‌ కల్యాణ్‌ పోషిస్తున్నాడని ఆయన దుయ్యబట్టారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి కూడా చీలనివ్వను. మొత్తం అందరిని కలుపుకునిపోతాను. మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం కానివ్వను.. ఇది నా శాసనం. వారహిపై రాష్ట్రం అంతా తిరుగుతా అని చెప్పిన పవన్‌.. మళ్లీ మాయం అయిపోయాడు. రెండు, మూడు మాసాలు కనిపించలేదు. నిన్న మళ్లీ హఠాత్తుగా ఆయన ఒక వీడియో విడుదల చేశాడు. తెలంగాణ మంత్రి హరీష్‌రావు చేసిన ఒక వ్యాఖ్యపై పలువురు ఏపీ మంత్రులు రియాక్షన్‌పై వీడియో చేశారు. మంత్రులు రియాక్ట్‌ కావడాన్ని పవన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. హరీష్‌రావు ఏ సందర్భంలో ఆ వాఖ్యలు చేశారో తెలియదు కానీ, ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు ఇలా రియాక్ట్‌ కావాల్సింది కాదంటారు పవన్‌..

ముందు హరీష్‌రావు ఏ సందర్భంలో ఏం మట్లాడారో తెలుసుకుని పవన్‌ మాట్లాడితే బాగుండేది. రాజకీయాల్లో గెస్ట్‌ అప్పిరియ‌న్స్‌లా ఉంటే ఇలానే ఉంటుంది. విషయాలు సరిగ్గా తెలియకుడా ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. హఠాత్తుగా తెలంగాణ ప్రజలపై పవన్‌ కల్యాణ్‌ ప్రేమ కురిపిస్తున్నాడు. తెలంగాణ ప్రజలు మనోభావాలు దెబ్బ తీస్తున్నారంటూ ఏపీ మంత్రులపై కన్నెర్ర చేస్తున్నాడు. హరీష్‌ వ్యాఖ్యలకు రియాక్షన్‌గా ఏపీ మంత్రులు వారి అభిప్రాయాలు వారు చెప్పారు. మధ్యలో​ పవన్‌ కల్యాణ్‌ వచ్చి ఏపీ మంత్రులే తప్పు చేశారన్నట్లు మాట్లాడుతున్నారు. కారణం ఉన్నా లేకపోయినా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని నిందించాలన్నది పవన్‌ వైఖరిగా కనబడుతోంది. అందులో భాగంగానే తెలంగాణ ప్రజల మనోభావాలు గుర్తుకువచ్చాయి.

గతంలో తెలంగాణ ప్రజల మనోభావాలను పవన్‌ కల్యాణ్‌ దెబ్బ తీశాడు. తెలంగాణ  ప్రజలు పెద్ద ఎత్తున రాష్ట్రం కోసం ఉద్యమం చేశారు, విభజన తర్వాత పవన్‌ ఏపీకి వెళ్లి అక్కడ బహిరంగ సభ పెట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు 11 రోజుల పాటు అన్నం తినకుండా ఏడ్చుకుంటూ పడుకున్నానంటూ చేసిన వ్యాఖ్యల సంగతి ఆయన మరిచిపోయారా?. తెలంగాణ ‍ప్రజల మనోభావాలు అప్పుడు దెబ్బతినలేదా?. పవన్‌ కల్యాణ్‌ది అపరిపక్వ రాజకీయ పరిణితి.
చదవండి: ఆయనే ఓ పెద్ద లాబీయిస్ట్‌.. దానికి తోడు పిచ్చి రాతలు

పవన్‌ ఆలోచనలు.. ఏపీ, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయడానికి కాదు.. ఆయన అవసరానికి మాట్లాడాలి కాబట్టి అలా మాట్లాడారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తానంటూ చంద్రబాబు తిరుగుతున్నాడు. ఆయనతో పాటు తెలంగాణలో లబ్ధి పొందడానికి తెలంగాణ భజన చేస్తున్న పవన్‌.. డ్రామాను తెలంగాణ, ఏపీ ప్రజలు అర్థం చేసుకోగలరని అమర్‌ అన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)