Breaking News

అవకాశవాదులకు బైబై.. సొంత కార్యకర్తలకు జైజై

Published on Mon, 06/30/2025 - 16:08

భారతీయ జనతా పార్టీ తెలుగువ రాష్ట్రాల శాఖలకు నూతన అధ్యక్షులను నియమించే విషయంలో పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని స్వచ్ఛమైన సొంత పార్టీ కార్యకర్తలకు మాత్రమే పట్టంగట్టింది. ఈ విషయంలో పైరవీలు రికమండేషన్లకు తావు లేకుండా నికార్సైన బిజెపి కార్యకర్తలకు పార్టీ పగ్గాలు అప్పగించింది. తెలంగాణకు ఎన్ రామచంద్రరావుని అధ్యక్షునిగా నియమించగా ఆంధ్ర ప్రదేశ్కు పివిఎన్ మాధవ్ ను సారధిగా నియమించారు. 

ఈ నియామకం విషయంలో పార్టీ ఢిల్లీ పెద్దలు పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం బిజెపి అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరి అవకాశవాదాన్ని కేంద్రంలోని బిజెపి పెద్దలు క్షమించే ఉద్దేశంలో లేకపోబట్టి ఆవిన్ను పక్కకు తప్పించారు. వాస్తవానికి ఆవిడ టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కుమార్తె అయినప్పటికీ కాంగ్రెస్ తరపున రెండుసార్లు ఎంపీగా కేంద్రంలో మంత్రిగా పనిచేశారు 

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ లో ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో ఆమె గత్యంతరం లేని పరిస్థితుల్లో బిజెపిలో చేరారు. ఇక్కడ ఆమె బిజెపిలో చేరినప్పటికీ ఆమె మనసు ఆలోచనలు అన్నీ కూడా ఆమె సామాజిక వర్గం వ్యాపార వర్గంతోబాటు ముఖ్యంగా తెలుగుదేశం అనుకూలంగానే ఉంటూ వచ్చారు తప్ప బీజేపీకి ఆమె ఏనాడు ఉపయోగపడలేదు. బిజెపి పేరు చెప్పుకొని ఆమె తన సొంత పరపతిని పెంచుకొని రాజకీయంగా ఎదిగారు తప్ప పార్టీని ఆమె ఎదగనివ్వలేదు. 

ఏదైతేనేం మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో ఆమె రాజమండ్రి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మొదటినుంచి అవకాశవాద రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పురందేశ్వరిని తప్పించాలని హార్డ్ కోర్ బిజెపి కార్యకర్తలు కోరుతూ వస్తున్నారు. పురందేశ్వరి ఎంత సేపు తన కుటుంబ పార్టీ ఆయన చంద్రబాబుకు తెలుగుదేశానికి ప్రయోజనం కలిగించే నిర్ణయాలే తీసుకున్నారు తప్ప బిజెపి బలోపేతానికి వీసమెత్తు కృషి కూడా చేయలేదు. ఆమె వైఖరిని మొదటి నుంచి గమనిస్తూ వస్తున్న ఢిల్లీ పెద్దలు ఇప్పుడు ఏకంగా ఆమెను పక్కకు తప్పించి జన్మతః బిజెపి కార్యకర్త ఆయన మాధవ్ కు ఆ బాధ్యతలు అప్పగించారు.

విశాఖనగరానికి చెందిన పోకల వంశీ నాగేంద్ర మాధవ్  ఆయన 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆ టర్మ్ పదవి ముగిసాక  2023లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఉత్తరాంధ్ర పట్టభధ్రుల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయాడు. 

వాస్తవానికి మాధవ తండ్రి పీవీ చలపతిరావు సీనియర్ బిజెపి నాయకుడు. అద్వానీ వాజ్పేయి వంటి దిగ్గజాలతో కలిసి నడిచిన వాడు. చలపతిరావు అంటే మోడీ ఇతర బిజెపి పెద్ద నాయకులకు కూడా అపారమైన గౌరవం. నికార్సైన చలపతిరావు కుటుంబానికి న్యాయం చేయాలి అనే భావనతో ఉన్న ఢిల్లీ పెద్దలు ఆయన కుమారుడు మాధవ్ కు ఇప్పుడు బిజెపి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. ఈ నియామకం తెలుగుదేశంతోపాటు అవకాశవాద రాజకీయాలు నేరిపే పురందేశ్వరికి షాకింగ్ అని చెప్పాలి.

పార్టీ ఆలోచనలు పార్టీ గీత దాటి అడుగు వేయని నిబద్ధత కలిగిన మాధవ్ ఏ విషయంలోనూ తెలుగుదేశానికి తలవంచకుండా పార్టీ బలోపేతానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తారు అని బిజెపి కార్యకర్తలు నమ్ముతున్నారు. అన్నిటికి మించి చంద్రబాబు బంధువు అయిన  పురందేశ్వరి కబ్జా నుంచి బిజెపిని విడిపించడం అతి పెద్ద అడుగు అని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. బిజెపిని చంద్రబాబు కాళ్ళ వద్ద తాకట్టు పెట్టి తన వ్యక్తిగత ప్రయోజనాలు పరపతి పెంచుకున్న పురందేశ్వరికి ఈ నిర్ణయం చేదుగానే ఉంటుంది కానీ నిజమైన బిజెపి కార్యకర్తలకు మాధవ నియామకం తీపి కబురు అని చెప్పాలి.
-సిమ్మాదిరప్పన్న

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)