స్పీకర్‌ ఎన్నిక: ఓటింగ్‌కు ఆ ఏడుగురు దూరం!.. ప్రభావమెంత?

Published on Wed, 06/26/2024 - 07:48

ఢిల్లీ: అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో 18వ పార్లమెంట్‌లోని లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక అనివార్యం అయింది. ఇవాళ లోక్‌సభ సభ స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ ఎంపీలకు విప్‌ జారీ చేశాయి. అయితే రెండురోజులు పాటు పార్లమెంట్‌లో ఎంపీల ప్రమాణ స్వీకారం జరగ్గా.. మరో ఏడుగురు సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేయలేదు. ఇది ఇవాళ్టి ఓటింగ్‌పై ప్రభావం చూపబోతుందా? అనే చర్చ నడుస్తోంది.  

ఎంపీలుగా ప్రమాణం చేయని వాళ్లలో ఇండియా కూటమికి చెందినవారే ఐదుగురు ఉండగా, మిగతా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు. శశిథరూర్‌, శతృఘ్న సిన్హాలాంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ఎంపీలుగా ప్రమాణం చేయలేదు కాబట్టి ఇవాళ స్పీకర్‌ ఎన్నికలో  ఈ ఏడుగురు ఓటింగ్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే.. 

ఓటింగ్‌పై ఇది ప్రభావం చూపెట్టే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు చెబుతున్నారు. సభకు హాజరయ్యే సభ్యుల ఆధారంగనే ఓటింగ్‌ మెజార్టీని లెక్కగడతారని వారంటున్నారు. అదే సమయంలో.. ఎన్డీయే కూటమి 293 సీట్లతో మెజార్టీలో ఉంది. స్పీకర్‌ ఎన్నికకు మ్యాజిక్‌ ఫిగర్‌ 269గా ఉంది. మరోవైపు బీజేపీ విజ్ఞప్తి మేరకు వైఎస్సార్‌సీపీ సానుకూలంగానే స్పందించింది. ఇక.. ఇండియా కూటమిలో మొత్తం 232గాను 227 మంది ఎంపీలు ప్రమాణం చేశారు. అంటే ఇండియా కూటమికి మెజార్టీ లేదనే చెప్పాలి.  దీంతో స్పీకర్‌ ఎన్నిక ఎన్డీయే వైపు ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. 

ఇక.. స్పీకర్‌ ఎన్నిక కోసం మెజార్టీ ఎంపీలు ఉన్నప్పటికీ బీజేపీ స్పీకర్‌ ఎన్నికలో 300 ఎంపీల ఓట్ల కోసం టార్గెట్‌ పెట్టుకుంది. అందులో భాగంగానే ఎన్డీయే కూటమిలో లేని పార్టీలను సైతం బీజేపీ మద్దతు కోరింది. స్పీకర్‌ ఎన్నికకు ఎన్డీయే కూటమి మాజీ స్పీకర్‌ కోటా ఎంపీ ఓం బిర్లాను, ఇడియా కూటమి కేరళ ఎంపీ కే. సురేష్‌ను బరిలోకి దింపాయి. ఇవాళ 11 గంటలకు స్పీకర్‌ ఓటింగ్‌ జరగనుంది.

Videos

ఇచ్చి ఒక నెల కూడా కాలేదు లోకేష్ ని ఏకిపారేసిన శ్రీదేవి

చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్ జగన్ ఆగ్రహం

డబ్బు కోసం స్నేహితుడినే కిడ్నాప్.. పట్టించిన వాట్సాప్ మెసేజ్

అమెరికా పునాదులు కదిలిస్తాం?

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

దులీప్ ట్రోపి ఫైనల్ నుండి వైభవ్ అవుట్?

నన్ను టార్గెట్ చేస్తే.. ఎమ్మెల్యేలకు కొండా హెచ్చరిక

Garam Garam : బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు

విజయవాడలో హైటెన్షన్ విద్యా భవన్ ముట్టడి

పోలీసులు కొట్టడంతోనే నా భర్త మృతి? గోపి లాకప్ డెత్ పై సంచలన నిజాలు

Photos

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)