Breaking News

గడియారం గుర్తు: సుప్రీం కోర్టును ఆశ్రయించిన శరద్‌ పవార్‌

Published on Wed, 10/02/2024 - 19:35

ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ  ఎన్సీపీ పార్టీ చిహ్నం (గడియారం) గుర్తు కేటాయింపు విషయంలో ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్‌ శరద్ పవార్‌  అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

 ఓటర్లలో గందరగోళాన్ని నివారించడానికి అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చిహ్నమైన ‘గడియారం’ గుర్తుకు బదులు గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవాలని వాదిస్తూ.. శరద్ పవార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో న్యాయబద్ధత, స్పష్టతను నిర్వహించటంలోని ప్రాముఖ్యతను పిటిషన్ పేర్కొన్నారు.

ఎన్సీపీ పార్టీ రెండు వర్గాలుగా చీలిపో​యిన అనంతంరం.. ఎన్సీపీ(ఎస్పీ) పార్టీకి భారత ఎన్నికల సంఘం తాత్కాలికంగా ‘మ్యాన్ బ్లోయింగ్ ఎ తుర్హా’(బాకా ఊదుతున్న వ్యక్తి) గుర్తును మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే తమకు గడియారం గుర్తుతో 25 ఏళ్ల  అనుబంధంద ఉంది. గడియారం గుర్తును అజిత్ పవార్ వర్గం ఉపయోగించుకోవడానికి అనుమతిస్తే.. ఓటర్లను తప్పుదారి పట్టించినట్లు అవుతుందని ఎన్నికల నిష్పక్షపాతానికి విఘాతం కలిగుతుందని శరద్‌ పవార్‌ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇక.. పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఓటరు గందరగోళాన్ని కూడా ఆయన పిటిషన్‌లో ప్రస్తావించారు. నియోజకవర్గాల పరిమాణం తక్కువగా ఉన్నందున రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గుర్తు సమస్య మరింత స్పష్టంగా కనిపించవచ్చని తెలిపారు.శరద్‌ పవార్‌ దాఖలుచేసిన పిటిషన్‌ అక్టోబరు 15న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)