Breaking News

డ్రామా అంటున్న వాళ్లు రాయితో కొట్టించుకోగలరా? 

Published on Tue, 04/16/2024 - 03:31

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడిని డ్రామా అంటున్న వారెవరైనా రాయితో కొట్టించుకోగలరా అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ను వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. పవన్‌ తన అభిమానులతో రాయితో కొట్టించుకోగలరా? కత్తితో పొడిపించుకోగలరా? అని ప్రశి్నంచారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్‌కు వస్తున్న ప్రజా స్పందనను చూసి టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు వణికిపోతున్నాయని, ఎన్నికల తర్వాత వాటికి పుట్టగతులుండవని భయపడుతున్నాయని చెప్పారు.

సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై దాడి యాదృచి్ఛకంగా జరిగింది కాదని, దాని వెనుక నేపథ్యం ఉంది కాబట్టే.. ఆ దాడి చేయించింది టీడీపీనే అంటూ తాము ఆరోపించామన్నారు. ఈ వ్యవహారంలో సంబంధం లేదని టీడీపీ వివరణ ఇచ్చుకోవచ్చు లేదంటే  సీబీఐ దర్యాప్తు కోరవచ్చని, విచారణ వేగంగా చేయాలని డిమాండ్‌ చేయవచ్చని, అలాకాకుండా ఇది డ్రామా అనటం సరికాదని చెప్పారు.

దాడి నింద తమపై పడుతుందని చంద్రబాబు భయపడుతున్నారన్న విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. సీఎం జగన్‌పై దాడి విషయంలో ప్రతిపక్షాలు ప్రజల్లో గందరగోళం సృష్టించేలా మాట్లాడుతున్నాయని చెప్పారు. సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి బెంబేలెత్తిపోయిన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ మతి లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  

విజయవాడలో సింగ్‌నగర్‌ డాబా కొట్ల సెంటర్‌లో ఈనెల 13న రోడ్‌ షో నిర్వహిస్తున్న సీఎం జగన్‌పై 8.15 గంటల ప్రాంతంలో దాడి జరిగితే.. రక్తం ధారగా కారుతున్నా ఓర్చుకుని, ప్రాథమిక చికిత్స చేయించుకుని ఆ తర్వాత రెండు గంటల పాటు బస్సుయాత్రలో పాల్గొన్నారని వివరించారు. ఎక్కడా గాయం చూపుతూ ప్రజల దగ్గర సానుభూతి పొందే ప్రయత్నం చేయలేదని చెప్పారు. వైద్యుల సూచనపై ఆ తర్వాతి రోజు విశ్రాంతి తీసుకున్నారని వివరించారు. అదే దాడి చంద్రబాబుపై జరిగి ఉంటే దాన్ని తన ప్రచారానికి వాడుకునేవారని చెప్పారు.

డ్రామాలాడే నైజం చంద్రబాబుదేనన్నారు. గతంలో అలిపిరి ఘటన జరిగినప్పుడు  చంద్రబాబు చేతికి కట్టువేసుకుని సానుభూతి పొందేందుకు ఆర్నెల్లు ప్రచారం చేసుకున్నారని తెలిపారు. 2019లో విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జగన్‌ను కత్తితో పొడిచినప్పుడు కూడా షర్ట్‌ రక్తంతో తడిసిపోయిందని, దాన్ని మార్చుకుని ఫ్లైట్‌ ఎక్కి హైద్రాబాద్‌కు చేరుకుని, చికిత్స తీసుకున్నారేగానీ ఎక్కడా ఆయనకు తగిలిన గాయం గురించి మాట్లాడలేదని గుర్తు చేశారు. డ్రామా ఆడాల్సిన అవసరం సీఎం జగన్‌కు ఏమాత్రం లేదని చెప్పారు. గతంలోకంటే మిన్నగా ఆయనకు ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలకు ఆదరణ తగ్గిపోయిందని, ఎక్కడికి వెళ్లినా దడి కట్టుకుని సమావేశాలు పెట్టుకుంటున్నారని దెప్పిపొడిచారు.  

గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరుగుతున్న శ్రీ మహారుద్ర సహిత రాజ శ్యామల సహస్ర చండీ యాగ మహోత్సవంలో సోమవారం వైఎస్సా­ర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.  జగన్‌ రెండోసారి అధికారం చేపట్టాలన్న ప్రజల ఆ­కాంక్ష దేవుడి కటాక్షంతో నెరవేరుతుందన్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)