Breaking News

‘రెండేళ్లలోనే బాబు పాలనపై జనం విసిగిపోయారు’

Published on Fri, 06/12/2026 - 15:52

సాక్షి, తాడేపల్లి: సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజలను చంద్రబాబు దగా చేశారని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా చంద్రబాబు పాలనలో దోపిడీ, హింస కొనసాగుతోంది. చంద్రబాబుకు రాజకీయంగా ఇదే లాస్ట్‌ టర్మ్. చంద్రబాబు పాలన అవినీతిలో కొత్త రికార్డులు సృష్టిస్తోందన్నారు.

‘‘సూపర్‌ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రజల్ని దగా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచే మోసాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్‌ను గద్దెదించి చంద్రబాబు సీఎం పీఠమొక్కారు. వైఎస్సార్‌ ఆదర్శవంతమైన పాలన అందించారు. వైఎస్‌ జగన్‌ ఆచరణలో మంచి పాలన తీసుకొచ్చారు. చంద్రబాబు పాలనలో మార్పు వస్తుందని ఆశించాం.. కానీ అది జరగలేదు.

సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజలను చంద్రబాబు దగా చేశారు. చంద్రబాబు జీవితమంతా ప్రజలను వంచించడమే. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు పాలనలో ప్రజలంతా విసిగిపోయి.. వైఎస్‌ జగన్‌ వైపు చూస్తున్నారు. ప్రజల గొంతుక వినిపించేలా ఇవాళ నిరసనలు బ్రహ్మాండంగా జరిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా రోడ్డు మీదకు వస్తున్నారు. కూటమి సర్కార్‌ నిరసనలను అడ్డుకునే ప్రయత్నం చేసింది. పోలీసులతో నిరసనలను అణచివేయాలని చూశారు. పోలీసుల ఆంక్షలను దాటుకుని ప్రజలు నిరసనలను విజయవంతం చేశారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

అవినీతిలో బాబు రికార్డ్స్ ఇవి

 

 

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)