Breaking News

‘భోగాపురం’ పూర్తి క్రెడిట్‌ వైఎస్‌ జగన్‌దే: సజ్జల

Published on Sat, 08/01/2026 - 17:36

సాక్షి, తాడేపల్లి: భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌పై చంద్రబాబువి అబద్ధపు ప్రచారాలని.. వైఎస్‌ జగన్ చేసిన మేలు అంతా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్, భోగాపురం వరకు అన్నీ క్రెడిట్ చోరీ. ఒక వైపు క్రెడిట్ చోరీ చేస్తూనే మరోవైపు మాపై విష ప్రచారం’’ అంటూ ఆయన మండిపడ్డారు.

‘‘డమ్మీ సీఎం చంద్రబాబు, డిఫ్యాక్టో సీఎం లోకేష్, డిప్యూటీ సీఎం పవన్‌తోపాటు ఇప్పుడు కొత్తగా ఇంకో సీఎం రామ్మోహన్ నాయుడు వచ్చారు. వేల ఎకరాలు ఎయిర్ పోర్టుకు ఎందుకని ఒక యువతి అడిగిందని జగన్ చెప్పారు. దానికి కూడా చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. కొబ్బరి కాయ కొట్టిందీ, గుమ్మడి కాయ కట్టిందీ నేనే అని చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గుచేటు. చంద్రబాబు శంకుస్థాపన రాయి వేసి చేతులు దులుపుకున్నారు. భోగాపురం పేరుతో వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. భోగాపురం ఎయిర్ పోర్టు కోసం వైఎస్‌ జగన్ రూ.1200 కోట్లు ఖర్చు చేశారు.

..2026 జూన్ లో విమానాలు ఎగురుతాయని జగన్ ఆరోజే చెప్పారు. జగన్ హయాంలోనే 75-80 శాతం పూర్తయింది. కరోనా లేకపోతే మా హయాంలోనే పూర్తయ్యేది. ఎయిర్ పోర్టు కలను సాకారం చేసింది వైఎస్‌ జగన్‌. చంద్రబాబు క్రెడిట్ చోరీ చేసినా మాకు ఇబ్బంది లేదు. కానీ మాపై విష ప్రచారం చేయటం ఎందుకు?. రూ.6,300 కోట్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి గట్కారీ ప్రకటించారు. కానీ చంద్రబాబు వచ్చి రెండేళ్లయినా ఇప్పటికీ ఆ రోడ్డు నిర్మాణానికి అతీగతీ లేదు. భోగాపురం నుండి విజయవాడకు విమానంలో వెళ్లటం కష్టంగా మారింది. దానికంటే  రైలు మార్గంలో వెళ్లటం తేలిక అని కూటమి నాయకుడే చెప్పారు. అప్పటికీ చంద్రబాబుకు బల్బు వెలగలేదు

..దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ కడపకు తెచ్చింది వైఎస్‌ జగన్. ఆయన స్వయంగా దాల్మియాతో మాట్లాడి ఫ్యాక్టరీ తెప్పించారు. స్టీల్ ప్లాంట్ కూడా వైఎస్‌ జగన్ తెప్పిస్తే పారిశ్రామిక వేత్తలను బెదిరించి తరిమేశారు. చంద్రబాబు రూ.30 వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టారు. తన బంధువు ఎంపీ భరత్ కు రూ.5 వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టారు. వైఎస్‌ జగన్ రిషి కొండ మీద బిల్డింగులు కట్టిస్తే తన కోసమే అన్నట్టు ప్రచారం చేశారు. మరి నిజంగా ఆ బిల్డింగులు వైఎస్‌ జగన్‌వే అయితే ఇప్పుడు అందులో ఎందుకు నివాసం ఉండటం లేదు?. చంద్రబాబు విష ప్రచారాన్నే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు

భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ జగన్ దే.. బాబు క్రెడిట్ చోరీని బయటపెట్టిన సజ్జల

..మహిళా ఎస్ఐ మీద అసభ్యంగా ప్రవర్తించారంటూ మా నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జై జగన్ నినాదాలతో ఎస్ఐ చెవులు మూసుకుంటే దాన్ని కూడా తప్పుదారి పట్టించారు. పైగా అన్ని రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎస్‌ఐను బెదిరించి మరీ బలవంతంగా కేసు పెట్టించారు. నిజానికి ఆ ఎస్‌ఐతో తప్పుగా ప్రవర్తించిందే పోలీసులు’’ అంటూ సజ్జల వివరించారు.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)