ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తింది: సజ్జల

Published on Mon, 05/13/2024 - 20:20

సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్‌  పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని.. ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తిందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందుగానే ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారన్నారు.

ప్రజలు ఓటు వేసేందుకు వెల్లువెత్తారు. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు సానుకూల ఓటుతో క్యూ కట్టారు. ఇంకా పోలింగ్‌ బూత్‌ల దగ్గర క్యూలైన్‌లో ఓటర్లున్నారని సజ్జల అన్నారు.

‘‘చిత్తూరు జిల్లాలో ఉదయం కత్తిపోట్లతో టీడీపీ నేతలు ప్రారంభించారు. టీడీపీ కార్యకర్తలు, గూండాలు రెచ్చిపోయి దాడులు చేశారు. అద్దంకి, పీలేరు, సత్తెనపల్లిలో హింసాకాండకు పాల్పడ్డారు. టీడీపీ మూకలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఈవీఎంలు ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారు. పేద ప్రజల అభివృద్ధే.. రాష్ట్రాభివృద్ధికి దారి తీస్తుంది’’ అని సజ్జల చెప్పారు.

‘‘కేంద్ర ప్రభుత్వం అండతో పోలింగ్‌ డే వరుకూ టీడీపీ నాటకాలు, దాడులు అన్ని చూశాం. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై కూడా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేశారు. టీడీపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేశాం’’అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)