Breaking News

ఇందిరమ్మ పాలనంటే ఇదేనా?: సబిత

Published on Thu, 08/01/2024 - 17:36

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ హామీలను నమ్మి ఆడబిడ్డలు ఓటేశారని.. రాష్ట్రంలో అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతుంటే సీఎం మాట్లాడటం లేదు.. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? అంటూ సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.

‘‘అసెంబ్లీలో మాట్లాడటానికి మైక్‌ ఇవ్వడం లేదు. నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిలబడ్డా మైక్‌ ఇవ్వలేదు. ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్‌ చేస్తామని చెప్పినా మాట్లాడనివ్వలేదు. శాడిస్ట్‌లాగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తమంటుంది. నోటి మాటల్లో కాదు నిజంగా చేసే దమ్ముందా?’’ అని సబితా ఇంద్రారెడ్డి నిలదీశారు.

ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, నాలుగు గంటలు నిలబడ్డా కనీసం మాకు మైక్ ఇవ్వలేదంటూ మండిపడ్డారు. జూనియర్ ఎమ్మెల్యేలు అవమానకరంగా ప్రవర్తించటం బాధగా ఉంది. ఇద్దరు మహిళ మంత్రులు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదు? మేము మాట్లాడి రెండు రోజులు అవుతుంటే ఎందుకు స్పందించటం లేదు.మహిళా మంత్రులు బాధ్యత కాదా?’’ అంటూ సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)