Breaking News

ప్రధాని మోదీతో భేటీ..‘బీజేపీ నేతలకు ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్‌ తప్పని సరి’

Published on Wed, 06/11/2025 - 16:10

సాక్షి,ఢిల్లీ: దేశంలో కోవిడ్‌-19 కేసులు విజృంభిస్తున్న తరుణంలో బీజేపీ అధిష్టానం అప్రమత్తమైంది.  ప్రధాని మోదీతో భేటీ అయ్యే నేతలు తప్పని సరిగా కోవిడ్‌-19 ఆర్టీ-పీసీఆర్‌ టెస్టు చేయించుకోవాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన నివాసంలో ఢిల్లీ బీజేపీ నేతలకు ఇవాళ సాయంత్రం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఏడుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఢిల్లీకి చెందిన దాదాపు 70 మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొన్ననున్నారు.

అయితే, దేశంలో కోవిడ్‌-19 నమోదువుతున్న కోవిడ్‌-19 కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.  ఈరోజు (బుధవారం) 7 వేల మార్కును దాటాయి. దీంతో పార్టీ అధినాయకత్వం పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం మోదీతో భేటీ కానున్న నేతలు  తప్పని సరిగా ఆర్టీ పీసీఆర్‌ టెస్టు చేయించుకోవాలని సూచించింది. 

మరోవైపు దేశంలో కోవిడ్‌-19 కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం డేటాను విడుదల చేసింది. ఆ డేటా ఆధారంగా, గడిచిన 24 గంటల్లో దేశంలో 306 కొత్త కేసులు నమోదు కాగా ఆరుగురు మరణించారు. కోవిడ్‌ కారణంగా కేరళలో ముగ్గురు, మహారాష్ట్ర (1),కర్ణాటక (2) మరణించారు.

కేరళలో అత్యధికంగా ఒకే రోజు 170 కొత్త కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 114 కొత్త ఇన్ఫెక్షన్లు, 1,223 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్ణాటకలో 100 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటాలో పేర్కొంది. ఢిల్లీలో గత 24 గంటల్లో 66 కొత్త కేసులు నమోదుగా.. రాజధానిలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య  757కు చేరుకుంది. కేరళ మొత్తం 2,000 యాక్టివ్ కేసులు మార్కును దాటడంతో అగ్రస్థానంలో ఉంది. తరువాత గుజరాత్, పశ్చిమ బెంగాల్,ఢిల్లీ ఉన్నాయి.

కేబినెట్ సమావేశంలో మంత్రులకు మోదీ క్లాస్

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)