Breaking News

కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తా

Published on Wed, 06/04/2025 - 12:36

సాక్షి,నగరి: ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోతే కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తామని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరికలు జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు వెన్నుపోటు దినం కార్యక్రమాన్నిపెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో నగరి నిర్వహించిన వెన్నుపోటు దినంలో ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంత వరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు. ప్రజల్ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసాలపై ఆర్డీఓకి అర్జీ ఇచ్చాం.  

ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి.రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని వదిలి ప్రజలకు సంక్షేమ కోసం పనిచేయాలి. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, మహిళలపై పైశాచికాలు తప్ప సురక్ష పాలన కరువైయింది. విద్యార్థులను,మహిళలను వెన్నుపోటు పొడిచారు కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఆంద్రప్రదేశ్‌గా మార్చింది ఈ కూటమి ప్రభుత్వం. 

ఎన్నికల ముందు ఊగిపోయినా పవన్ కళ్యాణ్ నేడు మహిళలపై దారుణాలు జరుగుతున్న మాట రావడం లేదు.పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ కోసం చూపిస్తున్న చొరవ ప్రజలపై లేదు.పదవ తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నెరవేర్చలేని నారా లోకేష్ పప్పు. రెడ్ బుక్ రాజ్యాన్ని పక్కన పెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాలి.కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగుతాం’అని హెచ్చరికలు జారీ చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)