Breaking News

ఘోర పరాభవంపై ఆర్జేడీ ఫస్ట్‌ రియాక్షన్‌

Published on Sat, 11/15/2025 - 14:27

పట్నా: బిహార్‌ ఘోర ఎన్నికల ఘోర పరాభవంపై రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీ స్పందించింది. రాజకీయ ప్రయాణంలో ఓటమి అనేది ఒక భాగమేనని.. అలాగే ప్రజాసేవ అనేది నిరంతర ప్రక్రియగా అభివర్ణించింది.

‘‘ప్రజాసేవ అనేది అంతం లేని ప్రయాణం. ఇందులో ఆటుపోట్లు.. ఎత్తుపల్లాలు సహజం. విజయం దక్కిందని అహంకారం ఉండదు. అలాగే.. ఓటమితో కుంగిపోం. రాష్ట్రీయ జనతా దళ్ అనేది పేదల పార్టీ. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. పేదల మధ్య వారి గొంతును ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది’’ అని ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన తనయుడు తేజస్వి యాదవ్‌ పేరిట సోషల్‌ మీడియాలో ఆ పార్టీ ఓ పోస్ట్‌ చేసింది.

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 202 సీట్లతో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరలించగా.. మిత్రపక్షం జేడీయూ రెండో స్థానంలో నిలిచింది. చిరాగ్‌ పాశ్వాన్‌ లోక్‌ జనశక్తి (రామ్‌ విలాస్‌) పార్టీ 19 స్థానాలు నెగ్గి.. అత్యధిక స్ట్రయిక్‌ రేట్‌ సాధించిన పార్టీగా నిలిచింది. 

ఇక.. ప్రతిపక్ష మహాఘట్‌ బంధన్‌ కూటమిలోని ఆర్జేడీ (RJD) 143 స్థానాల్లో పోటీ చేసి కేవలం 25 సీట్లు సాధించింది. గత ఎన్నికల్లో 75 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ.. ఈ ఎన్నికల్లో 25 స్థానాలకు పడిపోవడం గమనార్హం. 2010 తర్వాత ఆ పార్టీకి ఘోర పరాభవం ఇదే. మిత్రపక్షం కాంగ్రెస్‌ సైతం 61 స్థానాల్లో పోటీ చేసి ఆరు స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది(గత ఎన్నికల్లో 19 స్థానాలు నెగ్గింది). మహా కూటమిలో గేమ్‌ చేంజర్‌ అవుతుందని భావించిన వీఐపీ పార్టీ 0 స్థానాలతో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. సీపీఐ, సీపీఎం వామపక్షాలు 3 స్థానాలు దక్కించుకున్నాయి. మొత్తంగా విపక్ష కూటమి 34 స్థానాలను మాత్రమే పరిమితమైంది. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)