Breaking News

కాంగ్రెస్‌తోనే ప్రజాసంక్షేమం

Published on Fri, 01/27/2023 - 02:07

బొంరాస్‌పేట/సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తాగుబోతు పాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. గురువారం ఆయన వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం మదన్‌పల్లి నుంచి హాథ్‌సే హాథ్‌ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లు, భార్యాభర్తలకు వృద్ధాప్య పింఛన్లు, వ్యవసాయానికి ఉచిత కరెంటు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాభర్తీ వంటి హామీలు ఇచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంగారు తెలంగాణ పేరుతో ధరలు పెంచి పేదలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను పదవుల నుంచి తప్పించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. వికారాబాద్‌ జిల్లాలో కొత్తగా ఏర్పడిన దుద్యాల మండల కేంద్రంలో కూడా రేవంత్‌ యాత్ర కొనసాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. 

పార్టీ ఫిరాయిస్తే ఉరి శిక్ష విధించాలి
బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రూపకల్పన చేసిన రాజ్యాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అపహాస్యం చేశాయని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఫిరాయింపులను ప్రోత్సహించి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన 9 ప్రభుత్వాలను బీజేపీ కూలదోసిందని విమర్శించారు.గురువారం ఉదయం ఆయన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గాంధీభవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని అన్నారు. అవసరమైతే ఉరి వంటి కఠిన శిక్షలను అమలు చేసే విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గణతంత్ర దినోత్సవాన్ని ప్రగతిభవన్, రాజ్‌భవన్‌లకు పరిమితం చేసి.. సీఎం కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేశారని విమర్శించారు. గణతంత్ర దినోత్సవాన్ని జరపాలని హైకోర్టు, ప్రభుత్వానికి చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్‌ జావీద్, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)