Breaking News

సీఎం రేవంత్‌రెడ్డికి కేకే విందు

Published on Sun, 03/31/2024 - 04:17

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇత ర కాంగ్రెస్‌ నేతలకు బీఆర్‌ఎస్‌ సెక్రెటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తన ఇంట్లో విందు ఇచ్చారు. కేకే బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ కార్యక్ర మం ఏర్పాటు చేశారు. కేకే శుక్రవారమే సీఎం నివాసానికి వెళ్లి.. తన ఇంట్లో డిన్నర్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. పలువురు మంత్రులు, నేతలను కూడా రావాలని కోరారు. ఈ మేరకు శనివారం సాయంత్రం సీఎం రేవంత్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, అనిల్‌యాదవ్, సీనియర్‌ నేత కె.జానారెడ్డి, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేకే నివాసానికి వెళ్లారు.

శనివారం ఉదయమే కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్‌ మేయర్, కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి వారికి స్వాగతం పలికారు. కేకే ఆతిథ్యాన్ని స్వీకరించాక రేవంత్‌ వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కేకే ఎప్పుడు కాంగ్రెస్‌లో చేరుతారు, ఎవరి సమక్షంలో చేరుతారన్న దానిపై నేతలు చర్చించారు. అయితే కేకే ఆదివారం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ పెద్దల సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

కడియం శ్రీహరి, కావ్య నేడు చేరే చాన్స్‌! 
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పుడు చేరుతారన్న దానిపై స్పష్టత రాలేదు. శనివారం తన అనుచరులతో సమావేశమైన కడియం.. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని మాత్రమే చెప్పారు. మరోవైపు లోక్‌సభ అభ్యరి్థత్వాల ఖరారు కోసం కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఆదివారం ఢిల్లీలో సమావేశం కానుంది. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఈ భేటీలో ఖరారు చేయనున్నట్టు సమాచారం. కడియం కుమార్తె కావ్య వరంగల్‌లో కాంగ్రెస్‌ అభ్యరి్థగా పోటీలో ఉంటారన్న చర్చ నేపథ్యంలో.. శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారమే కాంగ్రెస్‌ కండువా కప్పుకొనే అవకాశం ఉందని గాం«దీభవన్‌ వర్గాలు చెప్తున్నాయి. కాగా సీఈసీ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు.  

కాంగ్రెస్‌లో విజయలక్ష్మి చేరిక 
బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): కేకే కుమార్తె, గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శనివారం జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి క్యాంపు ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో.. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, సీఎం రేవంత్‌ల సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)