Breaking News

ఓటమి భయంతోనే బద్నాం చేస్తున్నారు

Published on Tue, 10/31/2023 - 03:05

అంబర్‌పేట (హైదరాబాద్‌): పొడిచిన వ్యక్తి బీజేపీ.. కత్తిపోటుకు గురైన వ్యక్తి బీఆర్‌ఎస్‌ నేత అయితే సీఎం కేసీఆర్‌ మాత్రం కాంగ్రెస్‌ను బద్నాం చేయడం ఆయన ఓటమి భయానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం అంబర్‌పేట పార్టీ అభ్యర్థి రోహిన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన వి.హనుమంతరావుతో కలిసి మాట్లాడారు. బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్‌పై అసత్య ప్రచారాలతో కుట్ర చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సమ­క్షంలో బీజేపీలో చేరిన వ్యక్తి.. బీఆర్‌ఎస్‌ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేస్తే ఇది కాంగ్రెస్‌ పని అని సీఎం కేసీఆర్‌ దివాలాకోరు ఆరోపణలు చేయడం దారుణమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మహాత్మాగాంధీ సిద్ధాంతాలతో పని చేస్తుందని, శాంతియుత వాతావరణంలో తాము ఎన్నికల్లో కొట్లాడుతామని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అంబర్‌పేటను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని రేవంత్‌ హామీఇచ్చారు.

వీహెచ్‌ మాట్లాడుతూ తన హయాంలోనే అంబర్‌పేట చెప్పుకోదగ్గ అభివృద్ధి చెందిందని తెలిపారు. టికెట్ల విషయంలో పార్టీ నేతలకు జరిగిన అన్యాయాన్ని అధికారంలోకి వచ్చాక న్యాయం చేయాలని వీహెచ్‌ రేవంత్‌రెడ్డిని కోరారు. కాంగ్రెస్‌ ఇచి్చన ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించి అంబర్‌పేటలో విజ­యం సాధిస్తామని రోహిన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. పలువురు బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ పార్టీ­లో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మాజీ కార్పొరేటర్లు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)