Breaking News

జ్యూరిక్‌లో రేవంత్, చంద్రబాబు భేటీ

Published on Tue, 01/21/2025 - 04:48

సాక్షి, హైదరాబాద్‌: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘రైజింగ్‌ తెలంగాణ’బృందం సోమవారం ఉదయం ఆ దేశంలోని జ్యూరిక్‌ పట్టణానికి చేరుకుంది. జ్యురిక్‌ ఎయిర్‌పోర్టులో సీఎం బృందానికి ప్రవాస తెలంగాణ వాసులు స్వాగతం పలికారు. మరోవైపు దావోస్‌ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం కూడా జ్యురిక్‌ చేరుకుంది. 

ఎయిర్‌పోర్టులోనే ఇద్దరు సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్, చంద్రబాబులతో ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధి బృందాలు ఫొటోలు దిగాయి. 

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా.. 
రాష్ట్ర ప్రతినిధి బృందం జ్యూరిక్‌ నుంచి రైలులో దావోస్‌ నగరానికి చేరుకుని ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఇందులో పలువురు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సీఎం బృందం భేటీ కానుంది. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేలా ప్రణాళికలను వెల్లడించనుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)