Breaking News

టీ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం.. హైకమాండ్‌ ఏం చెప్పింది?

Published on Tue, 06/27/2023 - 16:32

సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ రచన సమావేశం మూడు గంటల పాటు సుదీర్ఘగా సాగింది. కాగా భారీ చేరికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్‌ సంతరించుకుంది. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిలతో పాటు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీ తదితరలు ఈ ఎన్నికల ‍వ్యూహ భేటీకి హాజరయ్యారు. 

భేటీ అనంతరం టీపీసీసీ ఛీప్‌ రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఎన్నికల కార్యచరణ మొదలైందని, రాబోయే 120 రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని తెలిపారు. ‘‘మేనిఫెస్టో రూపకల్పన త్వరగా పూర్తి చేయాలని చర్చ జరిపాం. అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై చర్చ జరిగింది. ఎన్నికల సన్నాహక సమావేశం సుదీర్ఘంగా చర్చ జరిగింది. కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయించాం. అక్కడ అనుసరించిన మౌలిక అంశాలు ఇక్కడ కూడా అమలు చేయాలని డిసైడ్ అయింది’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, అందరం ఐక్యంగా ఉండాలని అధిష్టానం కోరిందని, అభ్యర్థులను త్వరగా డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఖాళీగా ఉన్న పదవులు భర్తీ చేయాలి. కర్ణాటక తరహాలోనే వ్యూహం అమలు చేయాలని నిర్ణయం’’ జరిగిందని ఆయన పేర్కొన్నారు.
చదవండి: తెలంగాణలో మతతత్వం పెరుగుతోంది: అసదుద్దీన్‌ ఓవైసీ

మాజీ ఎంపీ మధు యాష్కీ మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్  పొత్తు ఉండదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారన్నారు. జాతీయస్థాయి ప్రతిపక్ష కూటమి లో బీఆర్‌ఎస్‌కు చోటు ఉండబోదు. తెలంగాణలో ప్రజలు త్యాగం చేస్తే, కేసీఆర్ ఫ్యామిలీ భోగం అనుభవిస్తుందని మధు యాషి అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జి మానిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ.. అందరి సూచనలను రాహుల్ గాంధీ విన్నారని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, వ్యూహాల గురించి చర్చించామన్నారు. తెలంగాణను కేసీఆర్‌ కుటుంబం లూటీ చేసిందని విమర్శించారు.
చదవండి: ఈటల భార్య జమున సంచలన ఆరోపణలు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)