భారత్‌ జోడో యాత్ర: రాహుల్‌ ఓకే అంటే పెళ్లికి రెడీ!

Published on Sun, 09/11/2022 - 11:40

చెన్నై: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. మూడో రోజు యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ శనివారం తమిళనాడు కన్యాకుమారిలోని మార్తాండం చేరుకున్నారు. ఇక్కడ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం మహిళా కార్యకర్తలు ఆయనతో ముచ్చటించారు. ఈ సమయంలో రాహుల్ పెళ్లి ప్రస్తావన కూడా వచ్చింది. ఓ మహిళ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి తమిళనాడు అంటే ఎంత ప్రేమో మాకు తెలుసు. అందుకే ఆయన పెళ్లి చేసుకునేందుకు ఓ తమిళ అమ్మాయిని చూసిపెడతాం అని అంది.

ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. భారత్ జోడో యాత్రలో ఇది వినోదాత్మకమైన క్షణం అన్నారు. పెళ్లి ప్రస్తావన రాగానే రాహుల్ గాంధీ ఎలా నవ్వుతున్నారో చూడండి అని ఓ ఫోటో కూడా షేర్ చేశారు.

దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సహా ఇతర సమస్యలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను బుధవారం కన్యాకుమారిలో ప్రారంభించారు. ఈ యాత్ర 150 రోజుల పాటు 3వేలకు పైగా కీలోమీటర్లు సాగనుంది. కశ్మీర్‌లో ముగుస్తుంది. ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది.
చదవండి: కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. సోనియాకు షాకిచ్చిన ఐదుగురు ఎంపీలు!

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

గోదారి గట్టుపైన మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)