Breaking News

చంద్రబాబుకి అది అలవాటే: రాయపాటి రంగారావు

Published on Sat, 01/13/2024 - 21:11

గుంటూరు, సాక్షి: టీడీపీని వీడినా.. చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టినా రాయపాటి రంగారావు కోపం చల్లారినట్లు కనిపించడం లేదు. తాజాగా ఆయన మరోసారి టీడీపీ అధినేత, ఆయన తనయుడు నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కుటుంబాల్లో చిచ్చు పెట్టడం చంద్రబాబుకు అలవాటైన పనేనని.. ఇప్పుడు తన కుటుంబంపై పడ్డారంటూ ఆగ్రహం వెల్లగక్కారాయన. 

‘‘చంద్రబాబు నాయుడు ఓ ఇంటర్నేషనల్ స్మగ్లర్.. కరప్షన్ కింగ్. రాజకీయాల్లో అవినీతి చేయాలనుకునేవాళ్లకు ఆయనొక రిఫరెన్స్‌. ఇప్పుడు లోకేష్‌ కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నాడు. పాదయాత్ర అయిపోయిన తర్వాత లోకేష్ డబ్బులు వసూలు చేసే పనిలో ఉన్నాడు’’ అని రంగారావు ఆరోపించారు. 

ఇదీ చదవండి: చంద్రబాబు వెన్నుపోటును తట్టుకోలేకే పవన్‌..

శైలజకు ఘాటు కౌంటర్‌
కుటుంబాల్లో చిచ్చు పెట్టడం చంద్రబాబు అలవాటేనని.. ఈ క్రమంలోనే రాయపాటి శైలజతో తనపై విమర్శలు చేయిస్తున్నారని రంగారావు కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు విజయవాడలో కేశినేని నాని కుటుంబంలో చిచ్చుపెట్టాడు. ఇప్పుడు మా కుటుంబంలో చిచ్చు పెట్టడానికే రాయపాటి శైలజ తో నా మీద ఆరోపణలు చేయిస్తున్నాడు. అసలు రాయపాటి శైలజకు పార్టీలో సభ్యత్వం ఉందా?.. అమరావతి ఉద్యమం పేరుతో ఎంత ఎంత వసూలు చేశారో ముందు రాయపాటి శైలజ చెప్పాలి. వసూలు చేసిన డబ్బులు ఎవరెవరి బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళినాయో అంతా నాకు తెలుసు. రాజకీయాల్లో చంద్రబాబు నిన్ను వాడుకుని వదిలేస్తాడంటూ శైలజకు రంగారావు హితవు పలికారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)