Breaking News

తమిళనాడు రైలు ప్రమాదం.. కేంద్రంపై రాహుల్‌ మండిపాటు

Published on Sat, 10/12/2024 - 11:43

తమిళనాడులో శుక్రవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. మైసూర్‌-దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్‌ గూడ్స్‌ రైలును ఢీకొట్టడంతో ఏకంగా 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి.రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 18 రైళ్లను రద్దు చేసింది. తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్లై రైల్వే ష్టేషన్‌ వద్ద రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

తాజాగా బాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై  కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దాదాపు 300 మంది ప్రయాణికుల ప్రాణాలను బలిగొన్న బాలాసోర్ దుర్ఘటనను ప్రస్తావిస్తూ.. గత సంఘటనల నుంచినేర్చుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

“మైసూరు-దర్భంగా రైలు ప్రమాదం భయంకరమైన బాలాసోర్ ప్రమాదానికి అద్దం పడుతుంది. ఒక ప్యాసింజర్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. అనేక ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ, గుణపాఠాలు నేర్చుకోలేదు. జవాబుదారీతనం లోపించింది. ఈ ప్రభుత్వం మేల్కోకముందే ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలి?’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

కాగా ఈ ఘటనలో 19  గాయాలవ్వగా, వారిని సమీపంలోని ఆసుప్రతికి తరలించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. రైలు సేవలను పునరుద్ధరించడానికి  మరో 18 గంటలు సమయం పడతుందని పేర్కొన్నారు. ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా దెబ్బతిన్న కోచ్‌లు డ్రోన్ ఫుటేజీలో కనిపిస్తున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ధృవీకరించారు.

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)