Rahul Gandhi: ప్రధాని మోదీ జన్మతః ఓబీసీ కాదు

Published on Fri, 02/09/2024 - 05:29

ఝార్సుగూడ(ఒడిశా): ప్రధాని మోదీ జన్మతః ఇతర వెనుకబడిన వర్గం(ఓబీసీ)వ్యక్తి కాదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. తనను తాను ఓబీసీ అని చెప్పుకుంటూ ప్రజలను మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. మోదీ ఘాంచి కులంలో పుట్టారని, 2000 సంవత్సరంలో గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ఈ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చిందని వివరించారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో భాగంగా గురువారం రాహుల్‌ గాంధీ ఒడిశాలోని ఝార్సుగూడలో జరిగిన సభలో మాట్లాడారు. గుజరాత్‌కు ముఖ్యమంత్రి అయ్యాక మోదీయే ఈ కులాన్ని ఓబీసీలో చేర్చారు. ఈ దృష్ట్యా, మోదీ పుట్టుకతోనే ఓబీసీకి చెందిన వ్యక్తి కారని పేర్కొన్నారు.

అంతకుముందు, మోదీది తెలి కులమని పేర్కొన్న రాహుల్‌ ఆ తర్వాత తన ఉద్దేశం ఘాంచి కులమంటూ వివరణ ఇచ్చారు. దేశంలో సామాజిక న్యాయం సాధించకుండా ప్రధాని మోదీ కులగణనను ఎప్పటికీ చేపట్టలేరని రాహుల్‌ చెప్పారు. ఓబీసీలతో కరచాలనం చేయని మోదీ బిలియనీర్లను మాత్రం ఆలింగనం చేసుకుంటారని విమర్శించారు. ‘ఒడిశాలోని గిరిజనుల భూములను లాగేసుకునేందుకు కుట్ర జరుగుతోంది. రాష్ట్రంలోని అధికార బీజేడీ, బీజేపీల మధ్య పీ, డీ తేడా మాత్రమే ఉంది. మిగతాదంతా సేమ్‌ టూ సేమ్‌. ఒకే నాణేనికి ఈ పారీ్టలు రెండు పార్శా్వలు’అని రాహుల్‌ పేర్కొన్నారు. ఒడిశాలో సుమారు 200 కిలోమీటర్ల మేర సాగిన జోడో యాత్ర గురువారం ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించింది. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)