Breaking News

ఉద్ధవ్‌ ఠాక్రేకు రాహుల్‌ గాంధీ ఫోన్‌.. సీట్ల పంపకంపై చర్చ!

Published on Fri, 02/23/2024 - 12:12

ముంబై: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సీట్ల పంపకం కసరత్తు విషయంలో వేగం పెంచుతోంది. ఈ క్రమంలో శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ  ఫోన్‌ చేసిన సుమారు గంటసేపు మాట్లడినట్లు తెలుస్తోంది. భారత్‌ జోడో న్యాయ యాత్రలో ఉ‍న్న రాహుల్‌ గాంధీ ప్రత్యేకంగా ఉద్ధవ్‌ ఠాక్రేకు ఫోన్‌ మాట్లాడటంపై ఇరు పార్టీల్లో సీట్ల పంపంకంపై చర్చ జరుగుతోంది. 

కాంగ్రెస్‌ పార్టీ ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాల్లో.. ముంబై సౌత్‌  సెంట్రల్‌, ముంబై నార్త్‌ సెంట్రల్‌, ముంబై నార్త్‌ వెస్త్‌ సగ్మెంట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఉద్ధవ్‌ ఠాక్రే ముంబై సౌత్‌, ముంబై నార్త్‌ వెస్ట్, ముంబై నార్త్‌ ఈస్ట్‌, ముంబై  సౌత్‌ సెంట్రల్‌ సీట్లను కలుపుకొని మొత్తం 18 లోక్‌సభ స్థానాల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈ సీట్ల సర్దుబాటు ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీ, శివసేన (యూబీటీ) మధ్య సీట్ల పంపకంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాహుల్‌  గాంధీ సీట్ల పంపకంపై మాట్లాడినట్లు సమాచారం. మహారాష్ట్రలోని 48 సీట్లలో 8 సీట్ల విషయంలో ఉన్న ప్రతిష్టంభనపై స్పష్టత  ఇవ్వడానికి రాహుల్‌ గాంధీ ఉద్ధవ్‌కు కాల్‌ చేసినట్లు తెలుస్తోంది. 

ఉమ్మడి శివసేన గత 2019లో పార్లమెంట్‌ ఎన్నికల్లో 48 సీట్లకు గాను 22 స్థానాల్లో పోటీ చేసి 18 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక.. శివసేనలో చీలిక వచ్చి కొంత మం‍ది ముఖ్యనేతలు ఏక్‌నాథ్‌షిండే వర్గంలో ఉండి బీజేపీలో చేరారు. అదే విధంగా మహాఘట్‌బంధన్‌ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఎన్సీపీలో సైతం చీలికలు వచ్చి అజిత్‌ పవార్‌ వర్గం బీజేపీలో చేరింది. మరోవైపు ఇటీవల మహారాష్ట్రలో  కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు అశోక్‌ చవాన్‌, మిలింద్‌ దేవరా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

ఈనేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ శివసేనతో సీట్ల పంపకం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్‌ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ, ఢిల్లీలో ఆప్‌తో సీట్ల పంపకం ఓ  కొలిక్కి  వచ్చిన నేపథ్యంలో ఠాక్రేకు  రాహుల్‌ కాల్‌ చేయటం చర్చనీయాంశంగా మారింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)