చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
మత్తులో మునిగే ముఖ్యమంత్రి డ్రగ్స్‌పై పోరాడగలరా?
Published on Wed, 11/04/2026 - 20:51
సంగ్రూర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. సంగ్రూర్‌లో ‘ఇన్సాఫ్ ర్యాలీ’లో ప్రసంగించారు. చాలా ఏళ్ల క్రితమే పంజాబ్ లో మాదకద్రవ్యాల ముప్పు పెరుగుతోందని తాను చెప్పానని తెలిపారు. అప్పట్లో బీజేపీ, అకాలీదళ్ పార్టీలు డ్రగ్స్ ముప్పును పట్టించుకోలేదన్నారు.
నేడు పంజాబ్‌లో చిట్టా(కల్తీ హెరాయిన్) ఒక ప్రధాన సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆప్ నేత, ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై రాహుల్ విమర్శలు గుప్పించారు. లోక్‌సభలో భగవంత్ మాన్ తమతో కలిసి కూర్చున్నప్పుడు జోకులు వేసేవారని, ఉదయం 11 గంటలకే ఆయన నుంచి మద్యం వాసన వచ్చేదని పేర్కొన్నారు. భగవంత్ మాన్ మద్యం సేవించకూడదని తాను అనడం లేదని, అది ఆయన వ్యక్తిగత విషయమని వ్యాఖ్యానించారు.
కానీ, డ్రగ్స్ సమస్యపై సమస్యపై పోరాడాలనుకుంటే ము ఖ్యమంత్రి ప్రతిరోజూ సాయంత్రం మత్తులో ఉండకూడదని తేల్చిచెప్పారు. పంజాబ్‌కు తమ ప్రయోజనాల కోసం పోరాడగల సమర్థుడైన నాయకుడు అవసరమని ఉద్ఘాటించారు. మాదకద్రవ్యాల వ్యసనం వల్ల కలిగే బాధను తన హృదయంతో అనుభవించగలిగే వ్యక్తి కావాలని అన్నారు. పంజాబ్‌లో మాదక ద్రవ్యాల బెడదను అంతం చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ చివరకు చేసిందేమీ లేదని మండిపడ్డారు.
ప్రజలను ‘ఆప్’ సర్కారు దగా చేసిందని ధ్వజమెత్తారు. పంజాబ్ కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజలకు అవసరమని, ‘ఢిల్లీ నుండి నడిచే’ ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి ప్రభుత్వం అక్కర్లేదని ఉద్ఘాటించారు. తాము పంజాబ్ గడ్డపై నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తామని, ఇందులో కేంద్ర హోంమంత్రి గానీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి గానీ జోక్యం చేసుకోరని పేర్కొన్నారు. ఈరోజు పంజాబ్ ప్రభుత్వ పగ్గాలు అమిత్ షా, అరవింద్ కేజ్రీవాల్ చేతుల్లో ఉన్నాయని దుయ్యబట్టారు. భగవంత్ మాన్ మాత్రం ఏమీ చేయకుండా కూర్చున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం, డ్రగ్స్ రహిత పంజాబ్ కోసం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మూసేవాలా పాటలు విన్నాను
కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక పార్టీ అంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. ఎక్కడికైనా రావొచ్చని, తనతో చర్చించాలని పేర్కొన్నారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య గురించి ప్రస్తావించారు. పంజాబ్‌లో శాంతిభద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని విమర్శించారు. ఇక్కడ హత్యలు ‘ఫ్యాషన్’గా మారాయని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యవసాయం వంటివి లేకపోతే మాదకద్రవ్యా ల వినియోగం, ముఠా సంస్కృతి మరింతగా పెరిగిపోతాయని అన్నారు. వీధుల్లో విచ్చలవిడిగా తుపాకీ కాల్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. కొన్నేళ్ల క్రితం సిద్ధూ మూసేవాలాను కలిశానని రాహుల్ గుర్తు చేసుకున్నారు.
ఆయన మంచి వ్యక్తి, గొప్ప సంగీత కళాకారుడు అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలను కుంటున్నట్లు మూసేవాలా తనతో చెప్పారని వివరించారు. ఎంతో చు రుకైన, ప్రతిభావంతుడైన యువకుడు కావ డంతో ఆయనను పార్టీలో చేర్చుకున్నామని చెప్పా రు. మూసేవాలా పాటలను తాను చాలాసార్లు విన్నానని తెలిపారు. మూసే వాలాకు కల్పించిన భద్రతను ప్రభుత్వం తొలగించిందని, పట్లపగలే ఆయన దారుణంగా హత్యకు గుర య్యారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ఇన్సాఫ్ ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున్ ఖర్గే, పంజాబ్ ఇన్‌ఛార్జ్ సచిన్ పైలట్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పర్గత్ సింగ్, సీనియర్ నేతలు పర్తాప్ బజ్వా, విజయ్ ఇందర్ సింగ్లా, చరణ్‌జిత్ సింగ్ చన్నీ, సుఖ్‌జిందర్ సింగ్ రంధావా, రాజిందర్ కౌర్ భట్టల్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ఎలాన్ మస్క్ సెటైర్లు
Tags : 1