Breaking News

‘BRS ఎమ్మెల్యేలది బలవంతపు ప్రెస్‌మీట్‌’

Published on Wed, 01/24/2024 - 13:42

హైదరాబాద్‌, సాక్షి: సీఎం రేవంత్‌ రెడ్డిని కలవడంపై బీఆర్‌ఎస్‌ మెదక్‌ ఎమ్మెల్యేలు  మీడియా ద్వారా  వివరణ ఇచ్చిన వేళ.. బీజేపీ నేత రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.  మెదక్‌ ఎంపీ సీటు కోసం కేసీఆర్‌ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని.. ఇవాళ బలవంతంగా మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్యేంతా బీఆర్‌ఎస్‌ను వీడడం ఖాయమని అన్నారాయన. 

తాజా పరిణామలపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మెదక్‌ ఎంపీ సీటు కోసం కేసీఆర్‌ కుటుంబంలో చిచ్చు రగిలింది. మెదక్‌ ఎంపీ సీటు కోసం కవిత పట్టుబట్టుతోంది. అందుకే హరీష్‌ రావు బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు. హరీష్‌రావుకు తెలియకుండానే ఆ నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను కలిశారా?. ఆయన అనుమతితోనే వాళ్లు కలిశారు. ఇవాళ బలవంతంగా వాళ్లతో ప్రెస్‌మీట్‌ పెట్టించారు. కానీ, మెదక్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి జంప్‌ కావడం ఖాయం’’ అని అన్నారాయన.  

బీఆర్‌ఎస్‌ పార్టీలో ఆధిపత్య పోరు జరుగుతోందని.. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఆ పార్టీ జీరో కాబోతోందని రఘునందన్‌ అన్నారు. ప్రోటోకాల్‌ కోసం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అంటున్నారు. మరి బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్‌ పాటించారా? అని నిలదీశారాయన. 

హిస్టరీ రిపీట్‌ అవుతది
ఇప్పుడున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 26 మంది అయిన తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. గతంలో గులాబీ పార్టీ కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలను ఎలా లాక్కుందో.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ అలాగే గుంజుకుంటుంది అని రఘనందన్‌ జోస్యం పలికారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)