Breaking News

35 మందిని ఒకేసారి విలీనం చేసుకోండి

Published on Mon, 07/15/2024 - 03:45

గజ్వేల్‌రూరల్‌/ప్రశాంత్‌నగర్‌: ‘బావ, బామ్మర్ది, మామ (హరీశ్, కేటీఆర్, కేసీఆర్‌).. ముగ్గురిని వదిలేసి, 35 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ ఒకేసారి విలీనం చేసుకోవాలి’అని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు వ్యంగ్యంగా అన్నా రు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో మహంకాళీ బోనాల ఉత్సవాలకు హాజరైన ఆయన అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. సంతలో పశువులను కొన్నట్లు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొంటున్నారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో రాజ్యాంగ విలువల గురించి మట్లాడుతూ, ఇక్కడ రేవంత్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనడాన్ని ఎందుకు చెక్‌ పెట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. ఒక సీఎం వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కండువా కప్పిన మరుక్షణం ఆ ఎమ్మెల్యేను డిస్‌క్వాలిఫై చేయాలని కర్ణాటకలో హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయంలో తెలంగాణ న్యాయ మూర్తులు, సుప్రీంకోర్టు జడ్జీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.  

పాలనపై దృష్టిపెట్టాలి..:బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పార్టీ ఫిరాయింపులపై కాకుండా పరిపాలనపై సీఎం దృష్టి సారించాలని ఎంపీ రఘునందన్‌రావు హితవు పలికారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో నంబర్‌ టూగా చెలామణి అవుతున్న మంత్రి, బీఆర్‌ఎస్‌ బెదిరింపులు ఆపేదాక ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఉంటాయనడం సరికాదన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)