Breaking News

వయనాడ్‌ విపత్తును బీజేపీ రాజకీయం చేస్తోంది: ప్రియాంకా గాంధీ

Published on Mon, 11/04/2024 - 15:52

తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన విపత్తును బీజేపీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. ప్రియాంకా గాంధీ.. లోక్‌సభ ఉప ఎన్నికల్లో భాగంగా.. వయనాడ్ జిల్లాలోని సుల్తాన్ బతేరి అసెంబ్లీ నియోజకవర్గంలోని కెనిచిరాలో  సోమవారంప్రచారం చేశారు.

‘‘ప్రజలకు తీరని బాధ కలిగించిన విపత్తును కూడా బీజేపీ రాజకీయం చేసింది. దేశం, ప్రజల ప్రయోజనాలు, దేశ రాజకీయాల గురించి ఆలోచించాల్సిన ప్రదేశంలో నిలబడి ఉన్నాం. కొండచరియలు విరిగిన జిల్లాలోని కుటుంబాలకు తగినంత సహాయం పంపిణీ చేయడంలో కేంద్రం విఫలమైంది. ఈ సమస్యపై పోరాడుతా. పార్లమెంటులో వయనాడ్‌ తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇస్తే.. నేను మీ కోసం అందరికంటే ఎక్కువగా కష్టపడి చూపిస్తా. 

..నేను మీ సమస్యలను ప్రతిచోటా వినిపిస్తాను. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తా. మీ అవసరాలు ప్రమాదంలో ఉన్నప్పుడు వెనక్కి తగ్గని పోరాటయోధురాలుగా మీ పక్కనే ఉంటా. ప్రజల సమస్యలపై దృష్టి సారించకుండా.. ద్వేషం, కోపం, విభజన, విధ్వంసాలను బీజేపీ ఉపయోగిస్తుంది. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, ఇలా అనేక సమస్యలను పరిష్కరించటంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. బీజేపీ రాజకీయాలు ఇక్కడి సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించటమే లక్ష్యంగా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ ఏకైక లక్ష్యం.. ఎంత ఖర్చు అయినా సరే అధికారంలో ఉండటం’’ అని అన్నారు.

జూలై​లో వయనాడ్‌లో చోటు చేసుకున్న కొండచరియలు విరిగిపడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో సుమారు 200 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. వంద  ఇళ్లు  బురదలో కొట్టుకుపోయాయి.

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు