Breaking News

చంద్రబాబు కెరీర్‌లోనే ఇది వరస్ట్‌ రాజకీయమట!

Published on Tue, 09/24/2024 - 13:29

రాజకీయాల్లో సుద్దపూసలు భూతద్దంతో వెతికితేనే కనిపిస్తారని ఓ మహానుభావుడన్నాడు. చంద్రబాబులాంటి ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ నేత ఆ కోవ కిందకు అసలే రారు. తాజాగా తిరుమల ప్రసాదంపై ఆయన చేసిన ప్రేలాపనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అదే టైంలో.. మునుపెన్నడూ లేనివిధంగా దిగజారిపోయి మరీ ఆయన మత రాజకీయాలకు దిగడం చూస్తున్నాం.

వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. బీజేపీతో ఎన్డీయే పొత్తులో ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు జాతీయ మీడియాను కూడా బాగానే మేనేజ్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది. తిరుపతి లడ్డూపై ఆయన కామెంట్లను అవి హైలెట్‌ చేసిన తీరే అందుకు నిదర్శనం. అయితే అందుకు భిన్నంగా  ఓ ఆంగ్ల మీడియాలో ప్రచురితమైన సంచలనాత్మక వ్యాసం .. ఇప్పుడు చర్చనీయాంశమైంది.

తిరుపతి లడ్డూపై కూటమి ప్రభుత్వం నడిపిస్తున్న రాజకీయాన్ని ఆ ఆర్టికల్‌ ఫుల్లుగా ఏకీపారేసింది. ముఖ్యంగా చంద్రబాబు తన స్వార్థ రాజకీయం కోసం ఆధారాల్లేకుండా చేసిన ఆరోపణలు.. ఆ ఆరోపణలను ఎలా అనుకూలంగా మార్చుకోవాలని చూసింది కపిల్ కోమిరెడ్డి ఆ వ్యాసంలో విశ్లేషించారు.

చంద్రబాబు చెబుతున్న అబద్ధాలు, వాస్తవాల వక్రీకరణ, తప్పుడు ప్రచారాలను విపులంగా అందులో వివరించారు. అదే టైంలో.. చంద్రబాబు కొత్తగా మొదలుపెట్టిన మతపరమైన రాజకీయాలనూ ప్రశ్నించారు. బాబు జిత్తులమారి రాజకీయానికి నిజనిర్ధారణతో సంబంధం లేకుండా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీలాంటి వాళ్లు పడిపోవడం సైతం ఆ ఆర్టికల్‌లో ప్రస్తావించారు.

ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు మార్క్‌ కన్నింగ్‌ రాజకీయం రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎలా నడిచిందనేది సైతం డిటైయిల్డ్‌గా చర్చించింది ఆ వ్యాసం. తండ్రి వైఎస్సార్‌ బాటలో అన్ని మతాలను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎలా ఆదరించింది.. అయినా కూడా జగన్‌పై హిందూ వ్యతిరేకి ముద్ర వేసేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాన్ని టచ్‌ చేసింది.

తిరుపతి ఆలయ ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలు.. ఉద్దేశపూర్వకమైనవేనని, పక్కా రాజకీయ లబ్ధి కోసమేనని కుండబద్ధలు కొట్టారు కపిల్‌. అలాగే.. ఆయన సుదీర్ఘ రాజకీయంలో ఇదే అత్యంత దిగజారిన పరిణామమని అభిప్రాయపడ్డారు.

చివరగా.. రాజకీయ సంస్కృతిలో మతాన్ని జొప్పించడం ద్వారా చంద్రబాబు ఘోరమైన తప్పిదమే చేశారని, ఏపీ ప్రజానీకం బాబు కుట్రలను, కుతంత్రాన్ని అర్థం చేసుకోగలరని ఆ వ్యాసం విశ్లేషించింది. ఏపీలో అధికారం  ఎల్లవేళ ఒకే పార్టీ దగ్గర ఉండదనే విషయాన్ని ప్రస్తావించింది.  మత రాజకీయం చేద్దామనుకున్న చంద్రబాబు ప్రయత్నం.. బెడిసి కొట్టడమే కాకుండా జీవితాంతం ఆయన్ని, ఆయన రాజకీయ వారసత్వాన్ని వెంటాడుతూనే ఉంటుందని ఆ ఆర్టికల్‌ పేర్కొంది. 

ప్రింట్‌ ఆంగ్ల వ్యాసం కోసం క్లిక్‌ చేయండి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)