Breaking News

రాహుల్‌, రేవంత్‌ టార్గెట్‌గా పీకే ఫైర్‌.. క్షమాపణ చెప్పాల్సిందే..

Published on Fri, 06/27/2025 - 13:51

పాట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కింది. బీహార్‌ రాజకీయాల్లో జన్‌ సురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌ కిశోర్‌ స్పీడ్‌ పెంచారు. అధికార నితీష్‌ కుమార్‌, కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసి తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. తాజాగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీకి ప్రశాంత్‌ కిషోర్‌ సవాల్‌ విసిరారు. బీహార్ పట్ల రాహుల్‌కు ఉన్న నిబద్ధతను పీకే ప్రశ్నించారు.

జన్‌ సురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌ కిశోర్‌ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘బీహార్‌లో అట్టడుగు వర్గాలతో మంచి సంబంధాలు ఉన్నాయని రాహుల్‌ గాంధీ చెప్పుకుంటున్నారు. బీహార్‌లోని‌ గ్రామంలో ఒక్క రాత్రి రాహుల్‌ ఉండాలని  సవాల్‌ చేస్తున్నాను. రాహుల్‌ రాష్ట్రానికి వస్తున్నారు.. పోతున్నారు. కానీ, ఎలాంటి యాత్రలు చేపట్టడం లేదు. రాహుల్‌ ఏదైనా ఒక గ్రామంలో ఒక్కరోజు ఉండగలిగితే.. ఆయన వ్యాఖ్యలను నేను అంగీకరిస్తాను. మీరు ఢిల్లీలో కూర్చుని.. బీహారీలను చూసి నవ్వండి. మాకు ఉపన్యాసాలు ఇవ్వడానికి మాత్రం ఇక్కడి రండి అని ఘాటు విమర్శలు చేశారు.

ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని కూడా పీకే టార్గెట్‌ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్‌ కిషోర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ, టీడీపీతో సంబంధాలున్నాయి. చివరకు కాంగ్రెస్‌లో చేరి ముఖ్యమంత్రి కాగలిగారు. సీఎం అయిన తర్వాత ఆయన బీహారీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శ్రమ చేయడం బీహారీల డీఎన్‌ఏలోనే ఉంది. బీహారీలు శ్రమ చేయడం కోసమే పుట్టారు అంటూ ఆయన మాట్లాడారు. ఆయన ఎందుకు అలా అన్నారు?. బీహారీ ప్రజల గురించి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. బీహారీల ప్రజల పట్ల సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం, అగౌరవం ఉంది.

1989లో అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ బీహార్‌ను అభివృద్ధి కేంద్రంగా మారుస్తానని చెప్పారు. ఆ డబ్బు ఎక్కడికి పోయింది?. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాబట్టి మీరు బీహార్‌కు ఏం చేశారో మాకు చెప్పండి? అని ప్రశ్నించారు. సిక్కులకు జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ క్షమాపణ చెబితే.. రాహుల్ గాంధీ బీహార్‌లో ప్రచారం చేసే ముందు బీహారీలకు కూడా క్షమాపణ చెప్పాలి. బీహారీలు శ్రమ కోసమే పుట్టినట్లయితే, మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? తెలంగాణలో ప్రచారం చేసి అక్కడ మీ ఓట్లు పొందండి. బీహార్‌లో కాంగ్రెస్‌కు ఉనికి లేదు. రాహుల్ గాంధీకి నిజంగా రాజకీయ బలం ఉంటే, ఆయన బీహార్‌లో ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలి. లాలూ పార్టీలో పొత్తు లేకుండా బరిలో దిగాలి అని సవాల్ విసిరారు. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)