Breaking News

గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచాక ఇంకో అవతారం!

Published on Thu, 09/26/2024 - 13:00

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ మరో ట్వీట్‌ చేశారు. ‘‘గెలిచే ముందు ఒక అవతారం. గెలిచాక ఇంకో అవతారం. ఏంటీ అవాంతరం.. ఎందుకీ అయోమయం.. ఏది నిజం?  జస్ట్‌ ఆస్కింగ్‌’’ అంటూ తనదైన శైలిలో పరోక్షంగా పవన్‌ను ఉద్దేశించే ఎక్స్‌ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. 

 

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై ఆరోపణలపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ప్రకాష్‌ రాజ్‌.. పవన్‌ కల్యాణ్‌ను కోట్‌ చేస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు. ‘మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు (కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు)’’ అని పేర్కొన్నారు.

దీనిపై పవన్‌ కల్యాణ్‌ మంగళవారం కనకదుర్గమ్మ ఆలయం వద్ద స్పందించారు. ప్రకాష్‌ రాజ్‌ అంటే గౌరవం ఉన్నప్పటికీ..  సున్నితాంశాలపై తెలుసుకుని మాట్లాడాలని పవన్‌ సూచించారు. ‘‘ ప్రకాష్‌ రాజ్‌తో పాటు పాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’’ అని పవన్‌ వ్యాఖ్యానించారు.

పవన్‌ వ్యాఖ్యలకు ప్రకాశ్‌ రాజ్ స్పందిస్తూ ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నలకు సమాధానమిస్తానని, అప్పటిదాకా  వీలుంటే తన ట్వీట్‌ మళ్లీ చదవి అర్థం చేసుకోవాలని’’ అని పేర్కొన్నారు. ఈ లోపు..

ఈలోపే.. ‘సత్యం సుందరం’ ఈవెంట్‌లో ‘లడ్డూ అంశం ప్రస్తుతం సున్నితమైంది’ అని నటుడు కార్తీ నవ్వుతూ చెప్పడంపైనా పవన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. పవిత్రమైన విషయాలను అపహాస్యం చేసేలా మాట్లాడొద్దని సూచించడంతో కార్తీ క్షమాపణ చెప్పారు. అందుకు పవన్‌ బదులిస్తూ, కార్తి కావాలని అనలేదని అర్థమైందని అనడంతో అక్కడికి ఆ వివాదం ముగిసింది. అయితే.. ‘చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్‌ ఆస్కింగ్‌...’ అని  ప్రకాశ్‌రాజ్ పోస్ట్‌ చేయడంతో  ఈ వ్యవహారం ఇక్కడితోనే ముగిసిపోదని అర్థమైంది. 

అరె అవతారం..అయోమయం.. పవన్ పై ప్రకాష్ రాజ్ పంచులు

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)