Breaking News

జార్ఖండ్‌కు ఆ మూడు పార్టీలు శత్రువులు: మోదీ

Published on Sun, 09/15/2024 - 15:28

రాంచీ: జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్‌ పార్టీలు జార్ఖండ్‌ రాష్ట్రానికి.. అతిపెద్ద శత్రువులని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జార్ఖండ్‌ను కాంగ్రెస్ చాలా కాలంగా ద్వేషిస్తోందని చెబుతూనే.. ఆర్జేడీ ఇప్పటికీ రాష్ట్ర ఏర్పాటుపై ప్రతీకారం కోరుకుంటోందని అన్నారు. ప్రధాని మోదీ జార్ఖండ్‌లోని ఆదివారం నిర్వహించిన ఓ సభలో మాట్లాడారు. 

‘‘అధికార జేఎంఎం పార్టీ ఆదివాసీ వర్గాలకు ద్రోహం చేస్తోంది. ఆదివాసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వారు ఇప్పుడు ఆ వర్గాల అటవీ భూమిని ఆక్రమించినవారితో చేతులు కలుపుతోంది. బంగ్లాదేశ్‌, రోహింగ్యా చొరబాటుదారుతో అధికార పార్టీ సంబంధాలు ఏర్పరుచుకుంటోంది. అంతే కాకుండా బుజ్జగింపు రాజకీయాలపై చేయటంలో  అధికార జేఎంఎం పార్టీ కాంగ్రెస్‌ పార్టీని సైతం అధిగమించింది. బుజ్జగింపు  రాజకీయం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా. దళితుల, గిరిజనులు వెనుకబడిన వర్గాల ప్రయోజనాలను  దెబ్బతీసి.. వారికి ద్రోహం చేయటమే కాంగ్రెస్‌ పార్టీ అజెండా.  ప్రస్తుతం అదే విధమైన ద్రోహం జేఎంఎం చర్యలలో స్పష్టంగా కనిపిస్తోంది’’ అని అన్నారు.

‘‘ జేఎంఎం ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో జార్ఖండ్‌ను దోచుకోవడం, అవినీతిపై మాత్రమే దృష్టి సారించింది. ఏ రంగాన్ని కూడా విడిచిపెట్టలేదు. నీరు, అడవులు, భూమి అన్నింటిలో అవినీతికి పాల్పడింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అవినీతి, అక్రమాలకు సంబంధించిన  ఈ కేసులన్నీ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామని హామీ ఇస్తున్నా. కొన్ని నెలల తర్వాత జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన  తర్వాత ఈ  సమస్యలను పరిష్కరిస్తాం. కొత్త పరిపాలనలో జవాబుదారీతనం, న్యాయాన్ని తీసుకురావాలనే బలమైన ఉద్దేశం మాది.  ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే ఏకైక పార్టీ బీజేపీ’ అని  మోదీ అన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ జార్ఖండ్‌లోని రాంచీలో రూ.660 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను  వర్చువల్‌గా  ప్రారంభించారు. టాటానగర్ నుంచి ప్రధాని మోదీ.. ఆరు వందే భారత్ రైళ్లను వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు.

చదవండి:  నాకు ప్రధాని ఆయ్యే అవకాశం వచ్చింది : గడ్కరీ

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)