Breaking News

ప్రేమ దుకాణం అంటూనే దాడులా?: ప్రధాని మోదీ

Published on Sat, 09/14/2024 - 14:40

ఢిల్లీ: జమ్ము కశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో..  కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్ర మోదీ. దోడాలో బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన.. క్రూరత్వాన్ని ఆస్వాదించడంలో కాంగ్రెస్‌ తారాస్థాయికి చేరిందని మండిపడ్డారు.

‘‘వాళ్లు(కాంగ్రెస్‌) నోరు తెరిస్తే ప్రేమ దుకాణం అంటున్నారు. కానీ, అమెరికాలో ఏం చేశారు?. ఓ జర్నలిస్ట్‌పై కిరాతకంగా దాడి చేశారు. ఓ భరతమాత ముద్దుబిడ్డకు అమెరికాలో అవమానం జరిగింది. స్వేచ్ఛ హక్కు కోసం పాటుపడే వీరులుగా తమను తాము అభివర్ణించుకుంటున్నవాళ్లు.. వాస్తవంలో అవతలివాళ్లను నోరు మెదపనివ్వట్లేదు. ప్రశ్నిస్తే.. దాడులతో పేట్రేగిపోతున్నారు’’ అని మోదీ ప్రసంగించారు.

ఇటీవల డల్లాస్‌లో ఇండియన్‌ ఓవర్‌సీస్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ శ్యామ్‌ పిట్రోడాను ఇంటర్వ్యూ చేసే క్రమంలో.. ఓ జాతీయ మీడియా సంస్థకు చెందిన కరస్పాండెంట్‌పై దాడి జరిగింది. తాను బంగ్లాదేశ్‌లో హిందువులే టార్గెట్‌గా  జరుగుతున్న దాడులపై పిట్రోడాను ప్రశ్నించానని, ఈలోపు కొందరు కాంగ్రెస్‌ వాళ్లు తనతో దురుసుగా ప్రవర్తించారని, తన ఫోన్‌ లాక్కొని ఇంటర్వ్యూ వీడియోను డిలీట్‌ చేశారని రోహిత్‌ శర్మ అనే ఆ రిపోర్టర్‌ ఆరోపించారు.  రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటనకు సరిగ్గా మూడు రోజుల ముందే ఈ ఘటన చోటు చేసుకుంది.

J&k: జమ్ముకశ్మీర్ లో ప్రధాని మోదీ పర్యటన

ఇదీ చదవండి: ‘ఆర్థిక మంత్రికి అహంకారం ఎక్కువా?’

ఈ ఘటననే ఇవాళ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇదే సభలో కూటమిపైనా ప్రధాని విసుర్లు విసిరారు. వారసత్వ రాజకీయాలతో యువత తీవ్రంగా నష్టపోతోందని, అసలు కాంగ్రెస్‌కు ఈ ప్రాంతమంటే లెక్కేలేదని అన్నారాయన. బీజేపీని గెలిపిస్తే.. కల్లోలిత ప్రాంతంగా పేరున్న జమ్ములో అభివృద్ధి బాటలు వేస్తామన్నారు. ఇదిలా ఉంటే.. సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత దోడే జిల్లాలో పర్యటించిన ప్రధాని మోదీనే కావడం గమనార్హం. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)