Breaking News

లోక్‌సభలో సోనియా గాంధీని పలకరించిన ప్రధాని మోదీ

Published on Thu, 07/20/2023 - 17:37

ఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున లోక్‌సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపు సంభాషించారు. ఇటీవల సోనియా, రాహుల్‌ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కావడాన్ని ప్రస్తావించిన ప్రధాని.. ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో మణిపుర్‌ అంశంపై కూడా చర్చించాలని ప్రధాని మోదీని ఆమె కోరినట్లు కాంగ్రెస్‌ సభ్యుడు అధిర్‌ రంజన్‌ ఛౌదురి తెలిపారు.

కాగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజే ఉభయసభలు దద్దరిలిపోయాయి. మణిపుర్‌ అంశంపైనే చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో మణిపూర్‌ ఘటనపై సభలో మోదీ ఎందుకు మాట్లాడరని టీఎంసీ సభ్యులు ప్రశ్నించారు. దీంతో రెండు సభలూ మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడ్డాయి.
చదవండి: మణిపూర్‌ ఘటన బాధాకరం: సుప్రీం కోర్టు

మణిపూర్‌ ఘటనపై ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. ఈ ఘటనపై ఒవైసీ పార్లమెంట్‌ వద్ద మాట్లాడుతూ.. ప్రస్తుతం వైరల్‌గా మారిన వీడియోపై ప్రధాని మోదీ స్పందించాల్సి వచ్చింది. అక్కడ నరమేధం జరుగుతోంది. మణిపూర్‌ సీఎంను తొలగించి, సీబీఐ విచారణకు ప్రధాని ఆదేశించినప్పుడే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)