Breaking News

జగన్‌ మీద విషం.. అడ్డంగా బుక్కైన ఈనాడు

Published on Sat, 09/13/2025 - 13:32

కూటమి పాలనలో ఎల్లో మీడియా రెచ్చిపోతూనే ఉంది. తాజాగా.. టీడీపీ కరపత్రిక ఈనాడు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై మరోసారి విషం చిమ్మింది. తీవ్ర ఆరోపణలు.. పచ్చి అబద్ధాలతో.. నిసిగ్గుగా ఓ కథనం ఇచ్చింది. ఈ క్రమంలో.. సంబంధం లేని అంశాలను జోడించి ప్రజల్లో అపోహలు కలిగించే తీవ్రంగా ప్రయత్నం చేసింది. 

లాయర్‌, ప్రముఖ వ్యాపారవేత్త అయిన సునీల్ రెడ్డిని మద్యం కేసులో సిట్‌ టార్గెట్‌ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఆయన  కార్యాలయాల్లో సోదాల పేరుతో హైడ్రామా నడిపించింది. సోదా సమయంలో సిట్‌ సభ్యులు తమతో పాటు లోపలికి ఓ బ్యాగ్‌ తీసుకెళ్లడం, అలాగే ఓ ప్రైవేట్ వాహనం రావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాహనంలో ఉన్న వస్తువులను కార్యాలయంలోకి చేరవేసి.. మద్యం కేసులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేశారనే ఆ అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. 

ఒకవైపు తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు సిట్‌ నానాతిప్పలు పడుతుంటే.. మరోవైపు తప్పుడు కేసు కోసం ఈనాడు పచ్చి అబద్ధాలు రాస్తోంది. గత ఐదేళ్లలో ప్రభుత్వ పదవులు చేపట్టని సునీల్‌రెడ్డి అనే వ్యక్తిని.. జగన్‌కు అత్యంత సన్నిహితుడని, ఆయన కోసం డొల్ల కంపెనీలు సృష్టించారంటూ కథనాలు అచ్చేసింది. ఇక.. 

చంద్రబాబు విసిరే బిస్కెట్ల కోసం ఇంతకు ముందూ జగన్‌, వైఎస్సార్‌సీపీ నేతలపై పలు అవాస్తవ కథనాలు ప్రచురించింది. మార్గదర్శి అక్రమాలపై చంద్రబాబు విచారణ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాబు ప్రాపకం కోసం ఈనాడు బరితెగిస్తోందన్నది స్పష్టమవుతోంది. ఈ క్రమంలో తాజా కథనం కూడా బాబుకు అనుకూలంగా, జగన్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అల్లేసిందనేనని వైఎస్సార్‌సీపీ అంటోంది.

మీడియా స్వేచ్ఛ అనే పదాన్ని ప్రత్యర్థులపై విషం చిమ్మేందుకు వేదికగా మార్చుకున్న ఈనాడు.. రాజకీయ అనుకూలత కోసం నిజాన్ని వక్రీకరించడంలో మరోసారి తన పాత్రను బహిరంగం చేసుకుందనే విమర్శ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. 

	చంద్రబాబు బిస్కెట్ల కోసం బరితెగించిన ఈనాడు పత్రిక

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)