Breaking News

చంద్రబాబు ఓ పిరికిపంద: పేర్ని నాని

Published on Sat, 02/11/2023 - 16:50

సాక్షి, అమరావతి: విషపు రాతలతో చంద్రబాబు ఒక పుస్తకం అచ్చు వేయించాడని, దానిపై తన పేరు కూడా వేసుకోలేని పిరికిపంద చంద్రబాబు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘పుస్తకంపై ఎక్కడా టీడీపీ పేరు లేదు. ఇవన్నీ అసత్యపు రాతలు కాబట్టే పేరు వేసుకునే ధైర్యం లేదు. అచ్చెన్నాయుడికి బాడీ తప్ప బుర్ర ఉండదు’’ అంటూ దుయ్యబట్టారు.

‘‘వివేకా హత్య సమయంలో ఎవరి ప్రభుత్వం ఉంది?. అప్పుడు మీరేం చేశారు. వివేకా భార్య, కుమార్తె, అల్లుడిని ఎందుకు విచారించలేదు. ఊళ్లో ఉన్న కుటుంబాన్ని ఎందుకు విచారించలేదు?. వివేకా కుమార్తె చెప్పిన అంశాలపై ఎందుకు విచారణ జరపలేదు?. ఎన్టీఆర్‌ మరణానికి కారణం చంద్రబాబు కదా?. ఎన్టీఆర్‌ మరణంపై కూడా ఒక పుస్తకం వేయించాలి. కోడెల శివప్రసాద్‌ మరణంపై సీబీఐ దర్యాప్తు ఎందుకు అడగలేదు. ఇటీవల ఎన్టీఆర్‌ కుమార్తె మరణంపై పుస్తకం ఎందుకు వేయలేదు’’ అని పేర్ని నాని ప్రశ్నించారు.

‘‘అవినాష్‌రెడ్డి సీబీఐకి స్టేట్‌మెంట్‌ ఇచ్చాడంటూ చంద్రబాబు ఎలా చెబుతాడు?.  సీబీఐ దగ్గర అవినాష్‌ చెప్పిన విషయాలు మీకు ఎలా తెలుసు?. సీబీఐ అధికారుల్లో చంద్రబాబు మనుషులు ఉన్నారా?. చంద్రబాబు డైరెక్షన్‌లో సీబీఐ నడుస్తుందా?. వివేకా హత్యపై టీడీపీ ప్రభుత్వంలో ఎందుకు ఛార్జ్‌షీట్‌ వేయలేదు?’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.

‘‘చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్‌ను దెబ్బతీయలేరు. రాజకీయాల కోసం ఇంట్లో ఆడవాళ్లను బజారున పెడతావు. సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా చేసింది ఎవరు?. రాజకీయాల కోసం మహిళలను బజారుకీడ్చే సంస్కృతి చంద్రబాబుది. ఇళ్లలో ఉన్న మహిళల ఫొటోలను పుస్తకంలో వేస్తారా?. మీ ఇంట్లో వారే మహిళలా? వేరే ఇళ్లలో ఉన్నవారు మహిళలు కాదా?. చంద్రబాబుది అతి నీచమైన, దుర్మార్గమైన సంస్కృతి. చంద్రబాబు లాంటి నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి ఎక్కడా ఉండడు’’ అంటూ  పేర్ని నాని నిప్పులు చెరిగారు.
చదవండి: పాదయాత్రల్లో బ్యాలెన్స్‌ తప్పుతున్న నేతలు




 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు