Breaking News

ఏపీ తాలిబన్ల ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Published on Wed, 07/23/2025 - 12:20

సాక్షి, రాజమండ్రి: కూటమి పాలనతో ఏపీలో ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా పోయిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాజమండ్రి జైలులో బుధవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డితో ములాఖత్‌ అయిన అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.  

ఏపీలో తాలిబన్ల పాలన నడుస్తోంది. ఏపీలో ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా పోయింది. కూటమి సర్కార్‌ అప్రజాస్వామిక్యంగా వెళ్తోంది. వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు.  ఈ ప్రభుత్వ చర్యలు చాలా ప్రమాదకరంగా ఉంటున్నాయి. అయినా మిథున్‌రెడ్డి కూటమి ప్రభుత్వ వేధింపులను దీటుగా ఎదుర్కొంటున్నారు. 

అయితే న్యాయపరంగా అందాల్సిన చర్యలను కూడా కూటమి అడ్డుకోవాలని చూస్తోంది. ఈ అన్యాయాలపై కచ్చితంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం అని పెద్దిరెడ్డి అన్నారు. 

వైఎస్సార్‌సీపీ హయాంలో లిక్కర్‌ స్కామ్‌ జరిగిందనేది కూటమి కుట్రేనని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు పర్మిషన్‌ ఇచ్చిన డిస్టలరీలతోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొనుగోలు జరిపింది. మా పాలనలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించింది. కానీ, కూటమి పాలనలో ఇంటింటికి మద్యం సరఫరా చేస్తున్నారు అని మండిపడ్డారాయన.

కూటమి ప్రభుత్వం డైవర్షన​ పాలిటిక్స్‌ చేస్తోంది. వైఎస్సార్‌సీపీ హయాంలో ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు.  మిథున్‌రెడ్డిపై లేనిపోని నిందలు వేస్తున్నారు. ఆయనపై పెట్టింది అక్రమ కేసు. వైఎస్సార్‌సీపీకి ఆయనకు అండగా ఉంటుంది మాజీ హోం మంత్రి అనిత అన్నారు.

ప్రతిపక్షం నోరు నొక్కాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వ వేధింపులకు భయపడి వెనక్కి తగ్గం అని మాజీ ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)