ఏపీలో ఉచిత గ్యాస్.. 40 లక్షల మందికి తుస్

Published on Fri, 11/01/2024 - 17:33

విజయవాడ, సాక్షి: ఉచిత గ్యాస్‌ పేరుతో మరో భారీ మోసానికి సీఎం చంద్రబాబు నాయుడు తెర తీశారు. ప్రారంభంలోనే 40 లక్షల మంది లబ్ధిదారులకు ఎగనామం పెట్టారు. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రకటన ద్వారా తేటతెల్లం కావడం గమనార్హం. 

ఏపీలో మొత్తం కోటి 48 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా కోటి 55 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నారు. అయితే.. పథకం ప్రారంభించిన నాడే 40 లక్షల మంది లబ్ధిదారులకు పైగా షాక్‌ తగిలింది. నిబంధనల పేరుతో వాళ్లకు ఫ్రీ సిలిండర్‌ కోత పెట్టింది కూటమి ప్రభుత్వం. మరోవైపు.. 

ఇన్నాళ్లూ లబ్ధిదారుల సంఖ్యను చంద్రబాబు ప్రభుత్వం బయటపెట్టకుండా వచ్చింది. అయితే డిప్యూటీ సీఎం పవన్‌ ఏమరపాటులో అన్నారో.. కావాలనే చెప్పారో తెలియదుకానీ.. ఈ పథకం కింద కోటి 8 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని చెప్పారు. దీంతో కూటమి సర్కార్‌ మోసం బయటపడింది. 

ఎన్నికల టైంలో.. కూటమి మేనిఫెస్టోలో ప్రతీ ఇంటికి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ గ్యాస్ సిలిండర్ల హామీకి తూట్లు పొడుస్తూ నిబంధనలను తెరపైకి తెచ్చారు. రేషన్ కార్డులున్న కుటుంబాలకు ఉచిత సిలిండర్లు ఇవ్వకపోగా.. తర్వాత డబ్బులు జమ చేస్తామంటూ మెలిక పెడుతున్నారు. చూస్తుంటే.. ఆరంభంలోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఈ పథకం లబ్ధిదారుల సంఖ్యను మరింతగా తగ్గించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)