Breaking News

రాజకీయాల్లో ‘సినిమా’లొద్దట.. పవన్‌ కొత్త పల్లవి

Published on Sun, 08/06/2023 - 13:29

సాక్షి, అమరావతి: పవన్‌కళ్యాణ్‌ తాజాగా నటించిన ‘బ్రో’ సినిమా వ్యవహారంలో మంత్రి అంబటి రాంబాబు చేసిన పలు సంచలన ఆరోపణలపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పందించకపోగా, ఇక నుంచి పార్టీ నేతలెవ్వరూ సినిమాల గురించి మాట్లాడ కండంటూ హుకుం జారీ చేయడం పట్ల విస్తుపోతున్నారు. రాజకీయాల్లో సినిమా ప్రస్తావనలొద్దని చెప్పడం వెనుక కారణం ఏంటని చర్చించుకుంటున్నారు.

సాధారణంగా ‘ఈ వకీల్‌సాబ్‌.. చెబుతున్నాడు’ అంటూ.. తాను నటించిన సినిమాలోని పా త్రలను ఉటంకిస్తూ మాట్లాడటం పరిపాటి. తన రాజకీయ ప్రసంగాల్లో ఎక్కువగా సినిమా విష యాలే ప్రస్తావిస్తూ ఉంటారు. అలాంటిది.. హఠాత్తుగా ‘సినిమాలను రాజకీయాల్లోకి తీసుకురావొద్ద’ంటూ నేతలకు బహిరంగంగా స్పష్టమైన సూచనలు చేయడం మంత్రి అంబటి లేవనెత్తిన అంశాలపై పార్టీ నాయకులు సైతం మాట్లాడకుండా ఉండడం కోసమేనని స్పష్టమవుతోంది. ఈ విధంగా తమ నోళ్లను కూడా మూయించారని జనసేన పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. 

పవన్‌ ఎంత తీసుకున్నాడు?
‘బ్రో’ సినిమాలో పరోక్షంగా మంత్రి అంబటిని ఉద్దేశించి కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు చిత్రీకరించడంపై సినిమా రిలీజ్‌ అయిన వెంటనే ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. రాజకీయాల కోసం సినిమాలు చేస్తున్నానని, రోజుకు రూ.రెండు కోట్లు రెమ్యునరేషన్‌ తీసుకుంటానని చెబుతున్న పవన్‌ కళ్యాణ్‌.. బ్రో సినిమాకు నిర్మాతల నుంచి ఎంత తీసుకున్నాడు?.. అసలు ఈ పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చి చెప్పాలంటూ మంత్రి అంబటి డిమాండ్‌ చేశారు. ఆ సినిమా వెనుక పెద్ద స్కామ్‌ దాగి ఉందని.. చంద్రబాబు అండ్‌ ముఠా అమెరికాలో చందాలు వసూలు చేసి, ఆ బ్లాక్‌ మనీని వైట్‌ చేసి పవన్‌ కళ్యాణ్‌కు ప్యాకేజీ రూపంలో ఇచ్చారని ఆరోపించారు.

వీటన్నింటిపై కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరగాలన్న డిమాండ్‌తో అంబటి ఢిల్లీ పర్యటనకు కూడా వెళ్లి రావడం తెలిసిందే. మంత్రి అంబటి ఢిల్లీలో ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసిన అనంతరం విలేకరులతో కూడా ఇవే విషయాలు చెప్పారు. ఈ విషయాలు నిజం కాకపోతే పవన్‌కళ్యాణ్‌ ఎందుకు ఖండించడం లేదనే చర్చ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. దీనిపై ఏం మాట్లాడితే ఏం బయట పడుతుందోనని పవన్‌ భయపడటం వల్లే ‘సినిమా’ ప్రస్తావనలు వద్దని సూచించారని జనసేనకు చెందిన ఓ నేత తెలిపారు. సినిమాలను రాజకీయాల్లోకి లాగొద్దని హితవు పలికిన పవన్‌.. ఆ సినిమాలో అంబటిని అవమానించేలా నృత్యం ఎందుకు పెట్టించాడో సమాధానం చెప్పాల్సి ఉంటుందని  రాజకీయ, సినీ విమర్శకులు పేర్కొంటున్నారు. 

చదవండి    పోలీసులపై జరిగిన దాడి పవన్‌కు కనిపించడం లేదా?: వెల్లంపల్లి

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)