Breaking News

జనసేన ఉండగా ప్రతిపక్షం ఎలా ఇస్తారు?: పవన్‌ కల్యాణ్‌

Published on Mon, 02/24/2025 - 13:10

అమరావతి, సాక్షి: వైఎస్సార్‌సీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా అంశంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం తర్వాత సభలో ఉంది తామేనని, కాబట్టి ప్రజాగళం వినిపించేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్‌సీపీ(YSRCP) డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ లోటును తాము భర్తీ చేస్తామన్న రీతిలో పవన్‌ మాట్లాడారు.

గవర్నర్‌ ప్రసంగం ముగిశాక.. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద జనసేన ఎమ్మెల్యేలతో పవన్‌ మాట్లాడారు. అసెంబ్లీలో అధికార టీడీపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ జనసేన పార్టీ(Jana Sena Party). అలాంటిది జనసేన ఉండగా వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు?. జనసేన కంటే ఒక్క సీటు వచ్చి ఉన్నా వాళ్లకు ఆ హోదా దక్కేది.

ఓట్ల శాతం ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటే గనుక జర్మనీకి వెళ్లాలి. ఎందుకంటే అక్కడ మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇవాళ గవర్నర్‌ ప్రసంగాన్ని(Governor Speech) వైఎస్సార్‌సీపీ బహిష్కరించడం కరెక్ట్‌ కాదు. అది ఎవరో ఇచ్చేది కాదు. గౌరవీనయులైన సీఎం చంద్రబాబుగారి చేతిలో అది లేదు. దానికి రూల్స్‌ రెగ్యులేషన్స్‌ ఉన్నాయి. ఈ ఐదేళ్లలో మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు. దానికి మీరు ప్రిపేర్‌ అవ్వండి’’ అని పవన్‌ వైఎస్సార్‌సీపీని ఉద్దేశించి అన్నారు.

ఇదీ చదవండి: ఇదీ చంద్రబాబు రాజకీయం!

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)